మొత్తానికి గోపాల..గొపాల అదృష్టం బాగుంది. సంక్రాంతి బరిలోకి సోలోగా దిగేలాగే కనిపిస్తోంది. శంకర్ ఐ వస్తుందా…రాదా అన్న మీమాంస అలాగే వుంది. కానీ ఐ యూనిట్ వర్గాలు మాత్రం విడుదల గ్యారంటీ అంటున్నాయి. అది వస్తే చెప్పలేం కానీ, రాకుంటే మాత్రం పండుగ సీజన్ ను గోపాలుడు సోలోగా దున్నేసుకుంటాడు.
ముకుంద, చినదాన నీ కోసం పోటీ పడుతున్నా, రెండింటికీ చాలా ఫ్రీగా మైదానం దొరికేస్తొంది. 24 నుంచి 14 వరకు ఇప్పటి వార్తల ప్రకారం సరైన సినిమా వుండేలా లేదు. దాంతో ఆ రెండూ బాగానే కలెక్షన్లు చేసుకోవచ్చు.
పటాస్ వస్తుంది అని అంటున్నారు. కానీ ఇంకా డిసైడ్ కాలేదు. టెంపర్ వెనక్కుపోయినట్లే. అందువల్ల ఐ రాకపోతే మాత్రం, ముకుంద, చినదాన నీకోసం, గోపాలగోపాల. ఒకవేళ వస్తే పటాస్..నాలుగింటికి మార్కెట్ వుంటుంది బ్రహ్మాండంగా.