కదిలిస్తే అవతల వాళ్ల సెక్సువల్ లైఫ్ గురించినే ఎక్కువగా అడుగుతాడు కరణ్ జొహార్. కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ లో అర్థవంతమైన ప్రశ్నల కన్నా, వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు? ఎంతమందితో పడుకున్నారు? క్రితం రోజు సెక్స్ చేశారా? ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి కరణ్ నుంచి. ఇక సెలబ్రిటీలు కూడా రెచ్చిపోయి సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఏదో విధంగా టాపిక్ ను ‘సెక్స్’ మీదకు మళ్లిస్తూ ఉంటారు!
ఈ కార్యక్రమం లేటెస్ట్ ఎపిసోడ్ కు సానియా మీర్జా, ఫరా ఖాన్ లు అతిథులుగా వచ్చారు. గౌరవప్రద స్థానంలో ఉన్న ఇద్దరు మహిళలు అక్కడ కూర్చున్నా.. నిర్లజ్జ పూర్వకంగా ‘సెక్స్’ ప్రస్తావన అయితే చాలా సార్లే వచ్చింది! కరణ్ మాత్రమే కాకుండా అతిథి ఫరాఖాన్ కూడా సెక్స్, కండోమ్ ల మాటెత్తింది!
‘హీరో రణ్ వీర్ సింగ్ కు మీరిచ్చే సలహా ఏమిటి?’ అని అడిగాడు కరణ్. అంతే ఫరా రెచ్చిపోయింది. ‘వెంట కండోమ్ ల బాక్స్ ఒకటి పెట్టుకోవాలి అతడు..’ అంటూ చాలా గొప్ప సలహా ఇచ్చింది ఈ డ్యాన్స్ డైరెక్టర్ కమ్ మూవీ డైరెక్టర్. మరి ఈ సలహా పరమార్థం ఏమిటో ఫరాఖాన్ కు, రణ్ వీర్ సింగ్ కు మాత్రమే తెలియాలి!
ఫరా ఇచ్చిన పూర్తి సమాధానం ఏమిటంటే.. ‘రణ్ వీర్ తన వెంట పెద్ద బాక్స్ నిండా కండోమ్ లు పెట్టుకోవాలి. అందులో ఏమైనా కొన్ని మిగిలితే వాటిని రణ్ భీర్ ను తీసుకొమ్మని చెబుతాను..’ అని చెప్పుకొస్తూ పకాపకా నవ్వింది ఫరా! మరి ఏ ‘అనుభవాల’ ఫలితమో ఈ సలహా!