రైల్వే దిగువ తరగతికి దూరంగా జరిగిపోతూ వస్తోంది. దురంతోలు, ఎసి స్పెషల్ లు, ఇలాంటివే తప్ప పాసింజర్ రైళ్లను, ఎక్స్ ప్రెస్ రైళ్లలో జనరల్ భోగీలను పెంచడం అన్నది మరిచిపోయారు.
ఇరవైకి పైగా బోగీలుండే ఎక్స్ ప్రెస్ రైళ్లలో రెండు మాత్రమే జనరల్ బోగీలు. దాన్నిండా జనమే జనం. ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా కామన్ మాన్ కు మరింత దూరం జరగుతోంది. వైఫై సదుపాయం, మంచినీళ్ల అమ్మకం, అడ్వాన్స్ రిజర్వేషన్, రైళ్ల స్పీడ్ పెంచడం ఇవన్నీ కామన్ మాన్ కు కాదు..స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, పేపర్ లెస్ వర్క్ ఇవన్నింటికంటే సామాన్యుడికి సరైన ప్రయాణ సాధనంగా రైల్వే మారాల్సి వుంది.
ఇప్పటికే బస్సురవాణా ఖరీదైపోయింది. ప్రయివేటు బస్సు రవాణా కన్నా ఒక్కోసారి విమాన సదుపాయం తక్కువగా వుంది. అలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఒక్క రైలు ప్రయాణమే దిక్కు. కానీ ప్రభుత్వాలకు హై ఫై వ్యవహారాలు తప్ప, సామాన్యుడు పట్టడం లేదు.