విలక్షణమైన నటుడు… పోసాని కృష్ణమురళి. ఆయన మేనరిజమ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. రాజా… రాజా… అంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటుంటాయి. రచయితగా సత్తా చూపిన పోసాని… ఇటీవల నటుడిగా బిజీ అయిపోయారు. వరుసగా అవకాశాలు అందుకొంటూ మంచి మంచి పాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే తాజాగా పోసానికి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయట.
మనోడు ఏ పాత్ర చేస్తే… ఆ పాత్ర పేరుతోనే పిలవడం అలవాటు చేసుకొన్నారట. ఆ మధ్య `మెంటల్‌కృష్ణ` అనే సినిమా చేశాడు. అప్పట్నుంచి అందరూ పోసానిని మెంటల్ అంటున్నారట. ఇప్పుడు `బ్రోకర్2` సినిమాలో నటించాడు. అందుకని ప్రతిఒక్కరూ కూడా `బ్రోకర్` అనే మాట కృష్ణమురళికి భలే యాప్ట్ అయ్యింది, అది తనకు తగిన కథ అంటూ మాట్లాడుతున్నారట.
`బ్రోకర్2` ఆడియో వేడుకలోనూ అదే రీతిలో అతిథులు మాట్లాడారట. దీంతో మనోడు చిర్రెత్తిపోయాడంట. “శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రతీ ఒక్కరూ శ్రీరామచంద్రుడు కాడు, అలాగే బ్రోకర్‌గా నటించినంత మాత్రాన నేను బ్రోకర్ని కాను. ముందు.. నేను నటుడ్ని. నన్ను అలాగే గుర్తించండి, మెంటలోడనో, బ్రోకర్ అనో పిలవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది“ అని చెప్పుకొచ్చాడట. కరెక్టే కదా… పోసాని ఆవేదనలో కూడా అర్థం ఉంది కదా!