అసలు తన గోల్ సినిమానే. ఎప్పుడో విశాఖపట్నంలో మిస్ విశాఖగా కిరీటం పెట్టించుకుని వెనువెంటనే మోడలింగ్ కోసం హైద్రాబాద్ వచ్చిన సెక్సీ యాంకర్ రేష్మీకు సినిమాలో చేసే అవకాశాలు కొన్ని వచ్చాయి. ఏవో గుర్తింపు లేని సినిమాలు కొన్ని చేసింది. తమిళంలో కూడా వాన పాటల్లో నటించింది. అయినా రాని పేరంతా ఇప్పుడు చేస్తున్న ఈ టీవీ ప్రోగ్రాం జబర్ధస్త్‌తోనే వచ్చింది. రేష్మీ లేని ఆ కామెడీ షోని ఊహించుకోవడం కష్టం.
ఎంతసేపు చూసినా బోర్ కొట్టని గ్లామర్ రేష్మీ సొంతమయ్యింది ఇప్పుడు. అయితే ఇంత గొప్ప ఆదరణతో సాగిపోతున్న జబర్ధస్త్‌ని వదిలి సినిమా చేసేంత తీరికయితే నాకు లేదండీ అని చెబుతుంది రేష్మీ. ఇప్పుడు తనని హీరోయిన్‌గా పెట్టుకుని సినిమాలు చెయ్యడానికి ఎంతో మంది సంప్రదిస్తున్నారట. ఒకప్పుడైతే ఎగిరిగంతేసేదే. ఇప్పుడు గొప్పగా ఫోకస్ అవుతున్న ప్రోగ్రాంని వదిలి ఎక్కిన కొమ్మనే నరుక్కునేంత అమాయకురాలు కాదు ఆవిడ.
సినిమాలు లాటరీ లాంటివి. ఏమో ఏది హిట్ అవుతుందో చెప్పలేం. దాని కన్నా అలవాటయిన ప్రోగ్రాంలో అన్నీ లభిస్తున్నప్పుడు సినిమాలు దేనికి. ఇకవేళ జబర్ధస్త్ ప్రోగ్రాం బోర్ కొట్టి ఎత్తేస్తే అప్పుడు సినిమాల కోసం ఆలోచిస్తుందేమో. ఏమయినా రేష్మి ఇప్పుడు అన్నీ తెలుసుకున్న ఆరింద అయ్యింది మరి.