సినిమా ఎంత బాగున్నా రైట్ టైమ్ రిలీజ్ లేకుంటే ఫలితంలో తేడా వస్తుంది. ఇప్పుడు జిల్ సినిమా గురించి టాలీవుడ్ లో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. 27న విడుదలకు వెళ్లడం అంత సేఫ్ గేమ్ కాదన్న సలహాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే 27న రేయ్ సినిమా విడుదల వుంది.
సినిమా ఎలా వుంటుంది..చిన్నదా, పెద్దదా అన్న సంగతి పక్కన పెడితే, మెగా ఫ్యాన్స్ అయినా కనీసం చూసేస్తారు. మరోపక్క కీలకమైన పరిక్షల సీజన్ వుంది. ఇంకోపక్క క్రికెట్. అన్నింటికి మించి, ఆ పై వారమే సన్నాఫ్ సత్యమూర్తి విడుదల. గతంలో లౌక్యం ఇలాగే విడుదలై, గోవిందుడు కోసం థియేటర్లు లేచిపోయాయి. తరువాత మళ్లీ లౌక్యమే గేమ్ నెగ్గింది. అది వేరే సంగతి.
ఇప్పుడు ఇన్ని టెన్షన్లు పడే కన్నా, రెండవ తేదీకి వారం గ్యాప్ ఇచ్చి, ఎనిమిది, తొమ్మిది తేదీల్లో వేసుకుంటే? ఆ తరువాత వెంటనే మరే సినిమాలు పెద్దగా లేవు. రెండు వారాల పాటు దున్నుకోవచ్చు..ఇవీ టాలీవుడ్లో వినిపిస్తున్న సలహాలు.