కేసిఆర్ కు మాస్టారి పాఠాలు

తెలంగాణ ఉద్యమం సాగినన్నాళ్లు కోదండరామ్ మాస్టారు ఓ లీడింగ్ పొజిషన్ లో వుండేవారు. ఉద్యమం ముగిసింది. రాష్ట్రం వచ్చేసింది. మాస్టారు కాస్తా కరివేపాకు చందమైపోయారు. నిజానికి కేసిఆర్ తలుచుకుంటే మాంచి సూపర్ నామినేటెడ్ పదవి…

తెలంగాణ ఉద్యమం సాగినన్నాళ్లు కోదండరామ్ మాస్టారు ఓ లీడింగ్ పొజిషన్ లో వుండేవారు. ఉద్యమం ముగిసింది. రాష్ట్రం వచ్చేసింది. మాస్టారు కాస్తా కరివేపాకు చందమైపోయారు. నిజానికి కేసిఆర్ తలుచుకుంటే మాంచి సూపర్ నామినేటెడ్ పదవి కోదండరామ్ మాస్టార్ని వెతుక్కుంటూ వచ్చేది. కానీ ఎందుకనో అలా జరగలేదు. 

ఇప్పుడు ఉన్నట్లుండి మాస్టారి మాట మళ్లీ వినిపిస్తోంది. వాస్తును నమ్ముకుని పాలించవద్దని ఆయన కేసిఆర్ కు పాఠాలు చెప్పడానికి ట్రయ్ చేస్తున్నారు. అంతే కాదు జనాల కోసం పాలించాలని, రియల్ ఎస్టేట్ కోసం కాదని కూడా చెబుతున్నారు. 

జెఎసి నాయకుడిగా ఈ మాత్రం చెప్పే హక్కు, చెప్పాల్సిన బాధ్యత ఆయనకు వుంది. కానీ కేసిఆర్ వింటారా..అన్నదే అనుమానం. కేసిఆర్ మొండివాడి కన్నా బలవంతుడు కదా?