చియాన్ + మీన‌న్‌

ఐ సినిమా ఫ్లాప్ అయినా.. విక్రమ్ ప‌డిన క‌ష్టాన్ని ఎవ్వరూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేదు. విక్రమ్ న‌ట‌న, రెండేళ్ల శ్రమ‌ మాత్రం బూడిద‌లో పోసిన ప‌న్నీరైంద‌ని బాధ‌ప‌డ్డారు. అయితే చిత్రసీమ‌లో న‌టుడిగా విక్రమ్ మ‌రో…

ఐ సినిమా ఫ్లాప్ అయినా.. విక్రమ్ ప‌డిన క‌ష్టాన్ని ఎవ్వరూ త‌క్కువ అంచ‌నా వేయ‌లేదు. విక్రమ్ న‌ట‌న, రెండేళ్ల శ్రమ‌ మాత్రం బూడిద‌లో పోసిన ప‌న్నీరైంద‌ని బాధ‌ప‌డ్డారు. అయితే చిత్రసీమ‌లో న‌టుడిగా విక్రమ్ మ‌రో మెట్టు ఎక్కేశాడు. 

అందుకే ఇప్పుడు అత‌నికి ఆఫ‌ర్లు అందుతున్నాయి. సృజనాత్మక చిత్రాల ద‌ర్శకుడు గౌత‌మ్ మీన‌న్ విక్రమ్ కోసం ఓ క‌థ రెడీ చేశాడ‌ట‌. విక్రమ్ కూడా దానికి ప‌చ్చజెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది.  'ఎన్నై అరిందాల్ ' తో  త‌మిళ‌ ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకొన్నాడు గౌత‌మ్‌మీన‌న్‌. 

తెలుగులో “ఎంతవాడు గానీ '' గా తెలుగులో విడుద‌ల కావ‌ల్సివుంది.  ఈలోగా విక్రమ్‌కి క‌థ చెప్పి ఓకే అనిపించుకొన్నాడు. ఇదో ల‌వ్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్వర‌లోనే పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.