కుమారి కేరాఫ్ అడ్రస్ అదేనా?

పరభాషా సినిమాలను చూసి మన డైరక్టర్లు ఇన్ స్పయిర్ కావడం మామూలే. కొందరు జిరాక్స్ కాపీలు తీస్తే, కొందరు కాస్త మన నేటివిటీకి మారుస్తారు.. మరి కొందరు. రెండు మూడు సినిమాలు కలిపి వండితే,…

పరభాషా సినిమాలను చూసి మన డైరక్టర్లు ఇన్ స్పయిర్ కావడం మామూలే. కొందరు జిరాక్స్ కాపీలు తీస్తే, కొందరు కాస్త మన నేటివిటీకి మారుస్తారు.. మరి కొందరు. రెండు మూడు సినిమాలు కలిపి వండితే, ఇంకొందరు లైన్ తీసుకుని డెవలప్ చేసుకుంటారు. సుకుమార్ తీసిన కుమారి 21 ఎఫ్ కు మూలం ఇదంటూ ఇప్పుడు నెటిజన్లు ఫార్వార్డ్ చేస్తున్నది లైలా సేస్ (lila says) అనే ఫ్రెంచ్ సినిమా.

వాస్తవానికి 1996లో నవలగా వచ్చింది ఇది. అది 2004లో సినిమాగా మారింది. అందులో హీరో కూడా నిరుద్యోగి..పారిస్ రైటర్స్ స్కూలులో చేరడానికి  ప్రయత్నాలు చేస్తుంటాడు. అతగాడు కాలనీలో ఆవారా గాళ్లతో కలిసి తిరుగుతుంటాడు. అలాంటి చోటికి వస్తుంది ఓ అమ్మాయి. కానీ ఈ ఆవారా గ్యాంగ్ ఆ అమ్మాయిని ఏడిపించడం, పక్కలోకి లాగాలని ప్రయత్నించడం కామన్. ఆమె వ్యవహారం వర్జిన్ నా కాదా అనే టైపులోనే వుంటుంది.

నిజానికి ఆమె వర్జిన్ నే. ఇక్కడి దాకానే సుక్కూ తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆపైన మళ్లీ కథ కాస్త వేరుగా వుంటుంది. మొత్తానికి సుక్కూను ఇన్సపియర్ చేసిందీ ఫ్రెంచ్ లైలా అన్నమాట.