లింగుస్వామికి లయిజనింగే మిగిలింది

లింగుస్వామి అంటే ఒకప్పుడు మాంచి కమర్షియల్ డైరక్టర్..ఒక దశలో నాగ్ లాంటి టాప్ హీరో కూడా తనతో ఓ సినిమా చేయచ్చుగా అని ఓపెన్ గానే అడిగేసాడు. కానీ, రోజులన్నీ ఒకలా వుండవుగా.. ఇప్పుడు…

లింగుస్వామి అంటే ఒకప్పుడు మాంచి కమర్షియల్ డైరక్టర్..ఒక దశలో నాగ్ లాంటి టాప్ హీరో కూడా తనతో ఓ సినిమా చేయచ్చుగా అని ఓపెన్ గానే అడిగేసాడు. కానీ, రోజులన్నీ ఒకలా వుండవుగా.. ఇప్పుడు లింగు స్వామి అంటే భయంకరమైన ఫ్లాప్ లు ఇచ్చిన డైరక్టర్ గా మిగిలాడు. తమిళనాట ఎలాగూ సినిమాలు లేవు. తెలుగులో తెగ ప్రయత్నిస్తున్నాడు.. ఎవరూ తల ఊపడం లేదు. 

ఏడాదికి పైగానే మహేష్ ను కలవాలని, లైన్ చెప్పాలని అనుకుంటున్నాడు కానీ సాధ్యం కాలేదు. పోనీ బన్నీతో చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. అయినా అక్కడి నుంచి కూడా ఏమంత పాజిటివ్ గా లేదు వ్యవహారం. ఇంకెవరు మిగిలారా అని కిందా మీదా వెదుకుతున్నాడు. మరోపక్క తమిళంలో వుంటుందేమో అనుకున్న పందెం కోడి సీక్వెల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక లింగుస్వామికి మిగిలింది ఏమిటో?