మనం…ఏమయింది?

అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీ మనం.ఇటు విమర్శల ప్రశంసలు, అటు ప్రేక్షకుల ప్రశంసలు బాగా దక్కాయి. కానీ ఈసారి అవార్డుల జాబితాలోమాత్రం ఎక్కడా మనం జాడ కనిపించలేదు. మరి నాగ్ జాతీయ అవార్డులకు మనం…

అక్కినేని ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీ మనం.ఇటు విమర్శల ప్రశంసలు, అటు ప్రేక్షకుల ప్రశంసలు బాగా దక్కాయి. కానీ ఈసారి అవార్డుల జాబితాలోమాత్రం ఎక్కడా మనం జాడ కనిపించలేదు. మరి నాగ్ జాతీయ అవార్డులకు మనం సినిమాను పంపినట్లా? పంపనట్లా? పంపినా జ్యూరీ దృష్టికి మనం ఏ విధంగానూ ఆనలేదా? 

కనీసం ఒక్క విభాగం కాకుంటే ఒక్క విభాగం లో కూడా మనం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదని జ్యూరీ భావించిందా? లేక అసలు నాగ్ వివిధ విభాగాలకు కానీ, మొత్తంగా కానీ అవార్డులకోసం అప్లయ్ చేయలేదా? స్క్రీన్ ప్లే, ఫొటోగ్రఫీ తదితర విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన మనంలో వుంది. మరి ఏ అవార్డూ ఎందుకు రాలేదో?