టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా

సెమీ ఫైనల్‌ కాదిది.. ఫైనల్‌ అన్నట్లుగానే ఆస్ట్రేలియా, టీమిండియా సన్నద్ధమయ్యాయి నేటి మ్యాచ్‌ కోసం. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కి దిగింది. టీమిండియా ముందు భారీ టార్గెట్‌ వుంచాలన్నది ఆస్ట్రేలియా…

సెమీ ఫైనల్‌ కాదిది.. ఫైనల్‌ అన్నట్లుగానే ఆస్ట్రేలియా, టీమిండియా సన్నద్ధమయ్యాయి నేటి మ్యాచ్‌ కోసం. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌కి దిగింది. టీమిండియా ముందు భారీ టార్గెట్‌ వుంచాలన్నది ఆస్ట్రేలియా వ్యూహంగా కన్పిస్తోంది.

సిడ్నీలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఎవరు విన్నర్‌ అయితే, ఆ జట్టు ఫైనల్‌కి అర్హత పొందుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో టీమిండియా, ఆస్ట్రేలియా సమ ఉజ్జీలుగా వున్నాయి. మొదట బ్యాటింగ్‌ చేసినా, ఛేజ్‌ చేయాల్సి వచ్చినా.. రెండిటికీ టీమిండియా సన్నద్ధంగానే వుంది. ఛేజింగ్‌లో విరాట్‌ కోహ్లీ రెచ్చిపోతాడు గనుక, ఆస్ట్రేలియా ఓ మోస్తరు టార్గెట్‌ వుంచితే, టీమిండియా గెలవడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇక, 300 పరుగులు ఖచ్చితంగా దాటుతామనే ధీమాతో వుంది ఆస్ట్రేలియా. ఓపెనర్లు రాణిస్తే, మాక్స్‌వెల్‌ విజృంభిస్తే, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుతాలు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సమయంలో, ఆస్ట్రేలియాని వీలైనంత తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేయడం భారత బౌలర్ల కర్తవ్యం. ఎవరి వ్యూహాలు వారికి వున్నాయి. సిడ్నీ గ్రౌండ్‌ స్పిన్‌కి అనుకూలిస్తుందన్నది నిన్నటిదాకా విన్పించిన మాట. అదెంత నిజం.. అన్నది కాస్సేపట్లో తేలిపోనుంది.