పాండవుల కథకు కొత్త ఫ్లేవర్ అద్దుతున్న చిత్రం పాండవులు పాండువుల తుమ్మెద. మంచు కుటుంబంలోని ముగ్గురు హీరోలూ తెరపై సందడి చేయనున్నారు. మోహన్‌బాబు తన తనయులిద్దరికీ అన్నయ్యగా కనిపించబోతున్నాడు. ఇది పాండవుల కథ కదా.. అందుకే ధర్మరాజు పాత్ర మోహన్ బాబుకి దక్కింది. పాండవుల కథనగానే అందరి దృష్టీ… బృహన్నలమీదే.
అసలు ఈ కథలో సెంట్రాఫ్ ఎట్రాక్షనే ఆ పాత్ర. మరి ఆ పాత్ర పోషించే `పోటుగాడు` ఎవ్వరు ఈ బ్యాచ్‌లో అంటే.. ఆ పాత్ర మంచు మనోజ్‌కి దక్కిందని సమాచారమ్. బృహన్నలగా కొన్ని నిమిషాల ఆయన తెరపై లేడీగెటప్ లో అలరించబోతున్నాడట. మరి లేడీ మనోజ్ ఎంత అల్లరి చేస్తాడో చూడాలి.