తెలుగు సినిమా రంగంలో ఆ నలుగురు అన్న పదం తరచు వినిపిస్తుంటుంది. పేర్లు మారొచ్చేమో కానీ, ఆ నలుగురు టాలీవుడ్ ను శాసిస్తున్నారు అని అనడం మాత్రం ఆగలేదు. ఇప్పడు ఆ నలుగురికి పోటీ కాదు కానీ, మరో ఆ నలుగురు సినిమా రంగంలో కనిపిస్తున్నారన్న టాక్ మొదలైంది.
Advertisement
ఈ కొత్త ఆ నలుగురు ఎవరో కాదు..మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్..శివాజీరాజా, కాదంబరి కిరణ్ కుమార్, ఏడిద శ్రీరామ్. మా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నుంచి, ఆ సంస్థ తరపున ఏ ఫంక్షన్ చేసినా ఈ నలుగురే కనిపిస్తున్నారట. మిగిలినవారు రావడం లేదో, మరి పిలవడం లేదో? లేదా వారు వేరే ' ఆ నలుగురు' అంటూ మరో గ్రూప్ ఫార్మ్ చేస్తారో? చూడాలి.