ఎన్ని సినిమాలు చేసినా కానీ ఇంతవరకు ఆమెపై మెగా హీరోల దృష్టి పడలేదు. చెప్పుకోతగ్గ పలు చిత్రాల్లో నటించినా కానీ మెగా సినిమాల్లో రెండో హీరోయిన్‌గా నటించే అవకాశం కూడా ఆమెకి రావడం లేదు. మెగా ఫ్యామిలీ హీరో ఒక్కరితో సినిమా చేస్తే వెంటనే మిగతా ఇద్దరితోను చేసే ఛాన్స్ వస్తుందని ఇటీవల పదే పదే రుజువవుతోంది.
అందుకే మెగా హీరోల దృష్టిని తనవైపుకి తిప్పుకోవాలని తాప్సీ తపన పడుతోంది. స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే ఏ లిస్ట్ హీరోలతో ఎక్కువ సినిమాలు చేయాలి కనుక, మెగా హీరోల్లో అగ్రశ్రేణికి చెందిన ముగ్గురున్నారు కనుక తాప్సీ తన మేనేజర్ ద్వారా తనవంతు ప్రయత్నం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అలాగే జూనియర్ ఎన్టీఆర్, మహేష్‌బాబులతో కూడా నటించే అవకాశం వస్తుందేమోనని ఆమె ఆశగా ఎదురు చూస్తోంది. పెద్ద హీరోలతో నటిస్తేనే తన రేంజ్ పెరుగుతుందని, ఆఫర్లు కూడా అదే వేగంతో వస్తాయని ఆమె గ్రహించింది. అందుకే ఇప్పుడు వారికి దూరంగా ఉండి వారే తన దాకా వచ్చే వరకు వేచి చూడకుండా తాప్సీనే ఎదురువెళ్లి వారిని తనవైపుకి ఆకర్షితులయ్యేలా ప్రయత్నిస్తోంది.