నాగ్ ఆయన్ను పిలుస్తారా?

స్టార్ హీరో నాగార్జున కొడుకు అఖిల్ పెళ్లి నిశ్చితార్థం డేట్ ఫిక్సయింది. పిలుపులు మొదలయ్యాయి. నాగార్జున వెళ్లి ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆహ్వానించారు. ఆ వార్త చకచకా వైరల్ అయిపోయింది. మరి చంద్రబాబును ఎప్పుడు…

స్టార్ హీరో నాగార్జున కొడుకు అఖిల్ పెళ్లి నిశ్చితార్థం డేట్ ఫిక్సయింది. పిలుపులు మొదలయ్యాయి. నాగార్జున వెళ్లి ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఆహ్వానించారు. ఆ వార్త చకచకా వైరల్ అయిపోయింది. మరి చంద్రబాబును ఎప్పుడు కలుస్తారా నాగార్జున అన్నది జనాల వెయిటంగ్.

నాగార్జునకు చంద్రబాబుకు మధ్య అంత గొప్ప రిలేషన్స్ ఏమీ బలంగా లేవన్నది ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే బాబు ప్రతిపక్షంలో వున్నపుడు నాగ్ అప్పటి సిఎమ్ వైఎస్ కు బాగా దగ్గరయ్యారు. ఆ క్రమంలో జగన్ కు కూడా అని టాక్. జగన్ కేసులో జైలుకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ కూడా నాగార్జునకు అత్యంత ఆప్తుడు.  ఎన్నికలకు ముందు మోడీని వెళ్లి కలిసి వచ్చారు నాగార్జున. కానీ చంద్రబాబుతో మాత్రం అంతంత మాత్రంగా, అంటీ ముట్టనట్లుగానే వుంటూ వస్తున్నారు. 

చిత్రమేమిటంటే నాగ్ కు అత్యంత సన్నిహితులు చాలా మంది బాబుగారి హితులే. దగ్గుబాటి సురేష్ కానీ, దర్శకుడు రాఘవేంద్రరావు కానీ చంద్రబాబు కోటరీ లోని వారే. అందువల్ల బాబును కలవాలని నాగార్జున అనుకోవాలే కానీ, క్షణంలో పని. మర్యాద కోసమన్నా చంద్రబాబును ఆహ్వానించడం ఖాయం. పైగా నాగ్ తో వియ్యం అందుతున్న జివికెే కు కూడా ఆంధ్రలో అనేక ప్రాజెక్టులు వున్నాయి. అందువల్ల సిఎమ్ తో రాపో తప్పకుండా వుండాల్సిందే. అయితే అది ఎప్పుడన్నదే ఆసక్తికరంగా వుంది.

ఫంక్షన్ ఇంకా దాదాపు ఇరవై రోజులకు పైగా దూరంలో వుంది కాబట్టి, ఆ క్షణం ఎప్పుడైనా రావచ్చేమో?