నాగచైతన్య దోచెయ్యాల్సిందే…

యంగ్‌ హీరోల రేసులో నాగార్జున తనయుడు నాగచైతన్య వెనకబడిపోయాడనే చెప్పాలి. ‘మనం’ సినిమా హిట్టయినా, ఆ తర్వాత వచ్చిన ‘ఒక లైలా కోసం’ బాగానే వుందనిపించుకున్నా.. యంగ్‌ హీరోల రేసులో నిలబడేందుకు అవసరమైన ‘మాంఛి…

యంగ్‌ హీరోల రేసులో నాగార్జున తనయుడు నాగచైతన్య వెనకబడిపోయాడనే చెప్పాలి. ‘మనం’ సినిమా హిట్టయినా, ఆ తర్వాత వచ్చిన ‘ఒక లైలా కోసం’ బాగానే వుందనిపించుకున్నా.. యంగ్‌ హీరోల రేసులో నిలబడేందుకు అవసరమైన ‘మాంఛి సక్సెస్‌’ అయితే నాగచైతన్యకు ఇటీవలి కాలంలో దక్కలేదు. ‘ఏ మాయ చేశావె’, ‘100 పర్సెంట్‌ లవ్‌’, ‘తడాఖా’ నాగచైతన్య కెరీర్‌లో పెద్ద హిట్స్‌.

‘మనం’ అద్భుతమైన సినిమాయే అయినా, ‘ఒక లైలా కోసం’ యూత్‌ని ఆకట్టుకున్నా, నాగచైతన్యలోని మాస్‌ అప్పీల్‌ని ఆశించే ఆడియన్స్‌ కాస్త నిరాశ చెందారు ఆ సినిమాలతో. ఈ టైమ్‌లో నాగచైతన్య నుంచి రానున్న ‘దోచెయ్‌’ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా అంచనాలతో వున్నారు. నాగచైతన్య కూడా ఈ సినిమా తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుందనే ధీమాతో వున్నాడట.

నాగచైతన్య హీరోగా ‘స్వామిరారా’ డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ తెరకెక్కించిన ‘దోచెయ్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేసింది ‘స్వామిరారా’. ఆ సినిమా దర్శకుడికీ బోల్డంత పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ‘దోచెయ్‌’పైనా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరుగుతున్నాయి. స్టిల్స్‌, పోస్టర్స్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మరి, నాగచైతన్య ఆశిస్తోన్న మాసివ్‌ హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాల్సిందే