నాగబాబు-ఆరెంజ్-అప్పులు

ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు నష్టపోయి ఉండొచ్చు. ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అంత మాత్రానికి దివాలా తీసేంత కుదేలైపోలేదు.

నటుడు, నిర్మాత నాగబాబు గురించి టాలీవుడ్‌లో చాలా కథనాలు వినిపేవి. అన్న కొడుకు, హీరో రామ్ చరణ్‌తో ఆరెంజ్ సినిమా నిర్మించి నాగబాబు కుదేలు అయిపోయారని, అప్పుల పాలయ్యారని, అలాంటి టైమ్‌లో అన్న చిరంజీవి కూడా ఆదుకోలేదని, బ్యాంక్ వాళ్లు ఇంటి మీదకు వస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్‌నే అడ్డం పడ్డారని, ఈ విషయంలో మెగాస్టార్‌కు పవర్ స్టార్‌కు మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని—ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బోలెడు గాసిప్‌లు. ఆ తర్వాత జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా నాగబాబుకు కాస్త ఊరట లభించింది. కొంత ఫిక్స్‌డ్ ఆదాయం రెగ్యులర్‌గా వచ్చేలా ఈ అవకాశాన్ని అందరూ కలిసి ఏర్పాటు చేసారని కూడా అనేవారు. చాలా ఏళ్లు జబర్దస్త్ కార్యక్రమం చేశారు. ఆ తర్వాత సినిమాలు, షోలు ఏమీ చేయకుండా ఉండిపోయారు.

కాని ఇప్పుడు అవన్నీ ప్యూర్ గాసిప్‌లే అని, ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు ఏమీ పాతాళానికి కూరుకుపోలేదని అర్థం అయింది. ఆయన ఆస్తులు ఇప్పుడు 70 కోట్లు. ఇది అధికారికంగా. వీటిలో 11 కోట్ల ఆస్తులు ఫిక్స్‌డ్ అసెట్స్. అంటే స్థిరాస్తులు. వీటి అఫీషియల్ వాల్యూ 11 కోట్లు అయినా మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువే ఉంటుంది.

పోనీ ఇవన్నీ ఆరెంజ్ సినిమా షాక్ నుంచి తేరుకుని, ఆ తర్వాత సంపాదించారు అని వాదించడానికి కూడా లేదు. ఎందుకంటే ఆరెంజ్ తర్వాత ఆయన సినిమాలు చేయలేదు. నటించిన సినిమాలు కూడా చాలా తక్కువ. చేసిన సినిమాలు, షోలు ఆయన లాంటి సెలబ్రిటీ మెంటైనెన్స్‌కే సరిపోతాయి.

అంటే, ఆరెంజ్ సినిమా వల్ల నాగబాబు నష్టపోయి ఉండొచ్చు. ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ అంత మాత్రానికి దివాలా తీసేంత కుదేలైపోలేదు. అప్పట్లో అలా వచ్చిన వార్తలన్నీ ప్యూర్ గాసిప్స్ అని ఇప్పుడు అర్థం అవుతోంది. ఎందుకంటే నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్‌తో పాటు తన ఆస్తుల డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటి ప్రకారం ఆయన ఆస్తుల విలువ 70 కోట్లు.

సో… గేమ్ ఈజ్ ఓవర్. అప్పులు… అన్నదమ్ములు ఆదుకోవడం… మనస్పర్థలు—అన్నీ గాసిప్స్. అంతే కదా!

24 Replies to “నాగబాబు-ఆరెంజ్-అప్పులు”

  1. హమ్మయ్య.. విషం చిమ్మేశారుగా .. ఇప్పుడు కంటి నిండా నిద్ర పడుతుంది హాయిగా పడుకోండి.

  2. మన అన్నయ్య కన్న తల్లి ని, సొంత చెల్లి ని ఆస్తి కోసం torture పెట్టే type అని…..ఇలా అందరి మీద విషం కక్కడం యెందుకు GA…అప్పట్లో దివాలా దాకా వెళ్లి నప్పుడు CHIRANJEEVI GAARU, PAWAN KALYAN GARU help చేసి ఆస్తులు జప్తు కాకుండా help చేశారు….ఐన అందరూ మీ లాగా వుండరు కదా GA…..

  3. మన జగన్ అన్న చెల్లికి రావల్సిన వాటా ఆస్తులు గురించి కూడా రాస్తే బాగుంటుంది కదా GA.. ఎప్పుడూ మెగా ఫ్యామిలీ మీద ఏడవడం విషం చిమ్మడం మానేసి మన అన్న ఫ్యామిలీ ఆస్తులు వాటాలు గురించి కూడా ఆర్టికల్ రాస్తే ప్రజలకి అర్దం అవుతుంది అన్న ఎలాంటి వాడో అని..

  4. Orange taruvata ayana 41 cinemallo act chesadu 4 serials lo act chesadu inka jabardasth and aa taruvata varuntej hero ga vachadu so ee 13 yellalo 70 kotlu sampadinchadam pedda kasthamemi kaadu.

  5. నమస్తే GA , దాదాపు అన్ని నిజాలే రాసావ్ కాకపోతే నీ వెర్షన్ లో రాసావు , ఆరంజ్ సినిమా విషయం లో జరిచిన గొడవ వేరు . చిరంజీవి మందలించింది కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యే దాక తెలుసుకోలేకపోవడం ఏంటి అని. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అడ్డం పడడం , ఆ విషయం లో నే పవన్ కి రేణు దేశాయ్ గారికి గొడవ జరగడం. కాకపోతే ఈ అన్నయ్య ఎం చేయలేదు అని రాసావో , ఆ అన్నయ్యే స్పాం ప్రసాద్ రెడ్డి తో మాట్లాడి జబర్దస్త్ లో ఉండేలా చేసారు . అలాగే ఆ అన్నయ్యే ఎప్పుడో మా టీవీ లో పెట్టుబడి పెట్టించి ఆ వాటా దాదాపు ౩౦ వరకు వచ్చేలా చేసారు

  6. 2005 లో పాదయాత్ర అప్పుడు ఇళ్లు తాకట్టు లో వుంది, ఒక ఆరేళ్ళు తరువాత వేల కోట్లు వచ్చాయి, ఇప్పుడు అదే వేల కోట్ల పంపకాలలో అన్న చెల్లి కి తేడా వచ్చింది. నాగబాబు తిప్పి కొడితే 100 కోట్ల లోపు మనిషి, కానీ నితి నిజాయతీ కి మాత్రం వేల కోట్లు ఎలా వచ్చాయి

  7. 2 1 ఏ ళ్ళ త ర్వా త చం ద్ర బాబు చెర నుంచి బయటకు వచ్చిన హైదరా బాద్ అ తి విలు వైన భూ ములు..

    మొత్తానికి 21 ఏళ్ళ ఫై ట్ త ర్వాత తెలం గా ణ హై కో ర్ట్ చంద్ర బా బు 2004 లో అధికారం కోల్పో డానికి కొద్దిరోజు లు ముందు బి ల్లీ రావు అ నే వ్య క్తికి ఆలౌ ట్ చేసి న 8 50 ఎకరాల భూ ము ల్ని కొట్టే సింది.. దాం తో ఇ ప్పుడు ఆ భూ ములు తెలం గాణ ప్రభు త్వానికి చెం దు తున్నా యి..

    ఇప్పుడు అవి తెలంగాణ రా ష్ట్రా నికి ఎం తో లాభం.. వాటిని అ మ్మి వే ల కోట్ల ఇ న్క మ్ సంపా దించే ప్లాన్ లో ఉంది…

    దా ని గు రించి పూ ర్తిగా తెలి యని వాళ్ల కి, బ్రీ ఫ్ గా దా ని స్టో రీ..

    200 4 అ ధి కారం కోల్పో డానికి అంటే ఎల క్ష న్ కి కొ ద్దీ రో జు ల ముం దు, బి ల్లీ రా వు అనే వ్యక్తి I M G భార త్ అనే కం పె నీ పెట్టాడు… ఇ ది ఒక ఫ్రా డ్ కంపె నీ…. IM G అనే ఇంట ర్నేష నల్ కం పెనీ పే రు వాడు కొని, కం పె నీ పెడితే, నాలు గు రోజుల్లో నే, ఆ కం పెనీ కి చం ద్ర బా బు, స్పో ర్ట్స్ డెవ లప్మెం ట్ అ ని చె ప్పి, 8 3 5 ఎక రాల ల్యాం డ్ ఇవ్వ డ మే కా కుం డా, హైద రా బాద్ లో ఉ న్న స్టేడి యం లు కూడా అప్ప చెప్పాడు…

    జనాల అదృష్టమో, ఇం కే దో వల్ల 20 04 లో ఓడిపో వ డంతో, తర వాత వచ్చిన వై స్సా ర్ గా రు ఆ డీ ల్ కా న్సుల్ చేశారు…. స్టేడి యం లు చెర నుం డి బయటకి వ చ్చాయి.. గా నీ, ల్యాం డ్ మాత్రం కో ర్ట్ కే సు లో ఉం డి పోయింది… ఇప్పుడు ఆ చెర వీ డిం ది…

    బాబు గారి జమా నాలో చేసిన ఎన్నో వేల sca lo ఇది ఒక్క చిన్న ….

  8. ఆరంజ్ సినిమాతో చాలా నష్టపోయానని నాగబాబే చెప్పాడు. డిప్రెషన్ లోకే వెళ్లానని, సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని. పవన్ కూడా ఈ అప్పులు తీర్చడానికే గబ్బర్ సింగ్ సినిమా చేసానని చెప్పాడు. మా టీవీ వాటాలు అమ్మినాక నాగబాబు మళ్ళీ సెటిల్ అయ్యాడు. ఇది తోబుట్టువుల మధ్య ఉండాల్సిన బంధం…

Comments are closed.