మాట‌లే.. ఒక్క ప్రైవేట్ కేసైనా వైసీపీ వేసిందా?

వైసీపీ నేత‌ల్లో తీవ్ర నిర్ల‌క్ష్యం క‌న‌పించ‌డంపై ఆ పార్టీ అభిమానుల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది.

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మొద‌లుకుని, వైసీపీ నేత‌లు నిత్యం వ‌ల్లించే మాట ప్రైవేట్ కేసులు. త‌మ వాళ్ల‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేసే పోలీసు అధికారుల‌ను ఉద్దేశించి ఈ హెచ్చ‌రిక చేస్తుంటారు. తాజాగా చిల‌క‌లూరిపేట సోష‌ల్ మీడియా ఇన్‌చార్జ్‌ను అరెస్ట్ చేశారు. ఇక పోసాని కృష్ణ‌ముర‌ళిపై కేసుల మీద కేసులు. ఒక కేసులో బెయిల్ వ‌చ్చినా, మ‌రికొన్ని కేసులు ఆయ‌న్ను వెంటాడుతున్నాయి.

రెడ్‌బుక్ పాల‌న‌పై ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా, త‌గ్గేదే లే అని మంత్రి నారా లోకేశ్ అంటున్నారు. పైగా రెడ్‌బుక్‌కు ప్ర‌జామోదం వుంద‌ని లోకేశ్ సెల‌విచ్చారు కూడా. ఈ నేప‌థ్యంలో వైసీపీ అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌లేద‌ని భావిస్తోందా? లేక ప్రైవేట్ కేసులు వేయ‌డానికి న్యాయ‌వాదులు దొర‌క‌డం లేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

క‌నీసం ఒక్క‌రంటే ఒక్క పోలీస్ అధికారిపై అయినా ప్రైవేట్ కేసు న‌మోదైతే, అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డానికి పోలీస్ అధికారుల్లో భ‌యం వుంటుంది. వైసీపీ మాట‌లే త‌ప్ప‌, చేత‌ల్లో ఏమీ వుండ‌ద‌నే భావ‌న అంద‌రిలోనూ వుంది. అందుకే జ‌గ‌న్ హెచ్చ‌రిక‌ల్ని ఎవ‌రూ సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. గ‌తంలో టీడీపీ వాళ్లు ఏ ర‌కంగా న్యాయ స్థానాల్లో కేసులు వేశారో వైసీపీ గుర్తు చేసుకోవ‌డం లేదు.

వైసీపీ నేత‌ల్లో తీవ్ర నిర్ల‌క్ష్యం క‌న‌పించ‌డంపై ఆ పార్టీ అభిమానుల్లో అస‌హ‌నం వ్య‌క్త‌మ‌వుతోంది. నిజంగా త‌మ వాళ్ల‌పై అక్ర‌మ కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని వైసీపీ నేత‌లు న‌మ్ముతుంటే, ప్రైవేట్ కేసులు వేయ‌డానికి ఎందుకు వెనుకాడుతున్నార‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌సరం ఉంది.

11 Replies to “మాట‌లే.. ఒక్క ప్రైవేట్ కేసైనా వైసీపీ వేసిందా?”

  1. లోకేష్ చెప్పింది కరెక్ట్ కదా…అన్న మాదిరి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని తరువాత మూడు ముక్కలాట ఆడటం లేదుగా.ముందే రెడ్ బుక్ పబ్లిక్ మీటింగ్ లో చూపించాడు. చట్ట ప్రకారం శిక్షిస్తాం అని కూడా చెప్పాడు

  2. అరే ఎర్రి హు….. ప్రైవేట్ కేసు అంటేనే న్యాయం కోసం అనికదా. అప్పుడు టీడీపీ వేసింది అంటే నే వాళ్ళ వాదనలో న్యాయం ఉంది అని. నువ్వు ఎంత జాకీలు వేసినా ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు చేసింది అన్యాయం అని నీకూ తెలుసు వాళ్ళకూ తెలుసు. ఎదో మరీ అన్యాయం అన్యాయం అనికూడా అర్వకపోతే బాగుండదులే అని అరవటమే కానీ అవి అనవసరపు ఖర్చులే అని మన లెవెన్ రెడ్డికి బాగా తెలుసులే

  3. లోకేష్ చెప్పింది కరెక్ట్ కదా…అన్న మాదిరి ఎన్నికల ముందు అమరావతి రాజధాని అని తరువాత మూడు ముక్కలాట ఆడటం లేదుగా.ముందే రెడ్ బుక్ పబ్లిక్ మీటింగ్ లో చూపించాడు. చట్ట ప్రకారం శిక్షిస్తాం అని కూడా చెప్పాడు

  4. Private cases just like that vesestara??? Ambati Rambabu garu lawyer ga vestene teesukoledani High Court ni asryancalisi vachindi ….

    Evaru modalupettaru ilantivi ani alochinchalsina samayamidi…..

  5. చెత్తనాకొడక ప్రయివేట్ కేసీలు ఎందుకు వేస్తారు తప్పు చెసింటేనే కదా జైలుకు పంపుతుండేది

Comments are closed.