టీమిండియా వరల్డ్ కప్ కొడితే నగ్నంగా కనిపిస్తానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన పూనమ్ పాండే గత నాలుగేళ్లలో అదే ఇమేజ్ కంటిన్యూ చేస్తూ ‘స్ట్రిప్ క్వీన్’గా పేరు తెచ్చుకుంది. ట్విట్టర్‌లో రెగ్యులర్‌గా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ పాపులారిటీ పెంచుకున్న పూనమ్ పాండే అదే జోరులో హీరోయిన్ కూడా అయిపోయింది.
ముందుగా బాలీవుడ్‌లో అవకాశం వచ్చినా కానీ పూనమ్‌ని వెండితెరపై చూసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. సన్నీ లియోనిలా తనకి కూడా బాలీవుడ్‌లో బ్రేక్ వస్తుందని ఆశించిన పూనమ్‌కి చుక్కెదురైంది. ఆమె చీప్ గిమ్మిక్స్‌ని ఫ్రీగా చూడ్డానికే తప్ప టికెట్ కొని చూసేంత సీన్ లేదని ప్రేక్షకులు తేల్చేసారు.
ఎలా అయినా సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకోవాలనే డెస్పరేట్ ఎటెంప్ట్‌లో భాగంగా పూనమ్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకి షిఫ్ట్ అయింది. ఆమె నటిస్తున్న ‘మాలిని అండ్ కో’ త్వరలోనే రిలీజ్‌కి రెడీ అవుతోంది. విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌తో ఎలాగైనా సక్సెస్ అయిపోవాలని చూస్తున్న పూనమ్ డెస్పరేషన్‌ని కనీసం తెలుగు ప్రేక్షకులైనా శాటిస్‌ఫై చేస్తారేమో చూడాలి.