స్వామిరారా, కార్తికేయ పుణ్యమా అంటూ హీరో నిఖిల్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అతగాడి తాజా సినిమా దాదాపు పది కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. టైగర్, బందిపోటు లాంటి సినిమాలు రిలీజ్ కు ముందు శాటిలైట్ కాలేదు. కానీ కార్తికేయ, ఇప్పుడు సూర్య వెర్సస్ సూర్య రెండూ ముందే శాటిలైట్ అయిపోయాయి.
మూడు కోట్లకు పైగా మొత్తానికి సూర్య వెర్సస్ సూర్య శాటిలైట్ ఫైనల్ అయింది. నైజాం రెండు కోట్లకు బిజినెస్ క్లోజ్ అయింది. ఓవర్సీస్, మిగిలిన ఏరియాలు కలిపి అయిదు కోట్లకు పైగా బిజినెస్ ఇచ్చాయి. అంటే నిర్మాత శివకుమార్ పెట్టిన దానికి అంతకు అంతా ప్రాఫిట్ చేసుకున్నట్లే.
ఇటీవలి కాలంలో ఏ చిన్న, మీడియం సినిమాలకు ఇలా జరగలేదు. బిజినెస్ జరగక నేరుగా విడుదల చేసుకుంటున్న సినిమాలే ఎక్కువ. సూర్య వెర్సస్ సూర్య బిజినెస్ పెరుగుతున్న నిఖిల్ క్రేజ్ ను స్పష్టం చేస్తోంది. ఒకవేళ అన్నీ బాగుండి ఈసినిమా కూడా హిట్ అయితే, సెకండ్ లైన్ హీరో రేంజ్ కు నిఖిల్ ప్రొమోట్ అయిపోతాడు.