Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పని వదిలేసి డీవోపీ డుమ్మా

పని వదిలేసి డీవోపీ డుమ్మా

పెద్ద హీరోల సినిమాలు అంటే ఓ భయమూ భక్తి వుంటాయి. అదే చిన్న, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు అన్నా, నిర్మాతలు అన్నా ఆ భయమూ భక్తీ వుండవు సరికదా, ఎవరి కోసం వెయిట్ చేస్తారు లే అన్న ధీమా వుంటుంది. 

ఓ మిడ్ రేంజ్ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. డిఐ జరగాల్సి వుంది. కానీ ఆ సినిమా డీవోపీ ఓ హీరో తో స్నేహం కోసమో, ఆబ్లిగేషన్ తోనో ఆ పని పక్కన పెట్టేసి అతగాడితో విదేశాలకు వెళ్లిపోయారు.

అక్కడకి వెళ్లి ఊరుకోకుండా ఆ హీరో చేస్తున్న సినిమా పనిలో వేలు, కాలు పెట్టేసి అక్కడే వుండిపోయారు. ఇక్కడ విడుదల కావాల్సిన సినిమా డిఐ పని అలా పక్కన  పడిపోయింది. దాంతో ఏం చేస్తారు చచ్చినట్లు వాయిదా వేసుకోవాల్సిందే. 

అదే పెద్ద నిర్మాత అయితే భయమూ, భక్తీ వుంటుంది. చిన్న నిర్మాత కదా నోరు మెదపలేరు. క్రియేటివ్ పీపుల్ తో గొడవ పెట్టుకుంటే క్వాలిటీ కొంప ముంచేస్తారు.

అదే ధీమా చాలా మంది టెక్నీషియన్స్ కు. పైగా తెరవెనుక రాజకీయాలు కూడా వుండనే వుంటాయి. ఫలానా సినిమాను దెబ్బ తీయాలంటే మార్గం ఏమిటి అని అన్వేషించేవారు వుంటారు. అలాంటి వారు ఇలాంటి సైడ్ ట్రాక్ ల్లోకి టెక్నీషియన్లను తీసుకెళ్తుంటారు. ఇవన్నీ కళ్ల ముందు జరుగుతుంటే చూస్తూ బాధపడడం తప్ప చిన్న నిర్మాతలు చేయగలిగింది లేదు. 

అదే దిల్ రాజు, అరవింద్, మైత్రీ, హారిక లాంటి బ్యానర్ లు అయితే ఇదే టెక్నీషియన్ వళ్లు దగ్గర పెట్టుకుని టైమ్ కు పని పూర్తి చేస్తారు. లేదంటే తిట్లు, దీవెనలు మామూలుగా పడవు. ఈ సినిమా నిర్మాత కూడా విడుదల తరువాత మొత్తం వ్యవహారాలు కక్కేయాలనే అనుకుంటున్నట్లు బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?