పవన్ చేతిలో మరో అడ్వాన్స్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు ఒప్పుకుంటున్నారు. చేస్తున్నారు. ఎప్పుడో ఒప్పుకున్న మైత్రీ మూవీస్, ఎఎమ్ రత్నం సినిమాలు చేతిలో వున్నాయి.  Advertisement దిల్ రాజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సినిమా పూర్తయిపోయి,…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకచకా సినిమాలు ఒప్పుకుంటున్నారు. చేస్తున్నారు. ఎప్పుడో ఒప్పుకున్న మైత్రీ మూవీస్, ఎఎమ్ రత్నం సినిమాలు చేతిలో వున్నాయి. 

దిల్ రాజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సినిమా పూర్తయిపోయి, విడుదలయిపోయింది. ఆ తరువాత మరో సినిమా అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ ప్రస్తుతం జరుగుతోంది. 

ఈ నాలుగు సినిమాలు కాకుండా రామ్ తాళ్లూరికి ఓ సినిమా చేస్తారని వార్తలు వున్నాయి. అంటే మొత్తం అయిదు కమ్ బ్యాక్ సినిమాలు అన్నమాట. 

పవన్ ఇక్కడితో ఆపేస్తారని, ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ఇక రాజకీయాల్లో బిజీగా వుంటారని టాక్ వుంది. కానీ అలా ఆపుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

ఎందుకుంటే కొత్త అడ్వాన్స్ లు కూడా తీసుకుంటున్నారనో, తీసుకునే ఆలోచనలో వున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాత కోనేరు సత్యనారాయణ కూడా పవన్ తొ సినిమా తీసే ఆలోచనలో వున్నారని, ఈ మేరకు అడ్వాన్స్ ఇచ్చారనో? ఇచ్చే ప్రయత్నంలో వున్నారనో తెలుస్తోంది.