Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'బాయ్స్' ను విడుదల చేసిన సన్నీలియోన్

'బాయ్స్' ను విడుదల చేసిన సన్నీలియోన్

శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై గీతానంద్, మిత్ర శర్మ ప్రధాన పాత్రల్లో దయానంద్ తెరకెక్కిస్తున్న సినిమా బాయ్స్. సెన్సేషనల్ హీరోయిన్ సన్నీ లియోన్ ఈ సినిమా టీజర్ ను  విడుద‌ల చేసారు.  

సోష‌ల్ మీడియాలో ఈ టీజ‌ర్ ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. బాయ్స్ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు ద‌యానంద్ ఓ న్యూ ఏజ్ రొమాంటిక్ అడల్ట్ ల‌వ్ స్టోరీగా రెడీ చేశార‌నే విష‌యం ఈ టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది. 

డైన‌మిక్ లేడీ ప్రొడ్యూసర్ మిత్ర శర్మ బాయ్స్ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు మిత్ర శర్మ. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన రాజా హే రాజా అనే యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?