గబ్బ సింగ్ 2 కోసం కసరత్తులు ముమ్మరం చేసింది చిత్రబృందం. ఈ సినిమాని ఎలాగైనా.. మార్చి నెలలో సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తోంది. మరోవైపు ఈ స్ర్కిప్టు పట్టుకొని కుస్తీలు పడుతున్నాడు దర్శకుడు బాబి. ఆల్రెడీ సంపత్ నంది ఇచ్చిన స్ర్కిప్టుకే మెరుగులు దిద్దుతున్నాడు.
ఈలోగా ఈ సినిమాలో మరో కథానాయికని ఎంపిక చేయాలని చిత్రబృందం డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ తెలుగమ్మాయి అనీషా ఆంబ్రోస్‌కి కథానాయికగా ఛాన్స్ ఇచ్చేశారు. ఈ కథలో మరో నాయికకీ చోటుంది. అందుకే ఆ అమ్మాయి కోసం వేట మొదలైంది. అనిషా దాదాపుగా కొత్తమ్మాయి. ఆమె గ్లామర్ అంతంత మాత్రమే. సో.. రెండో కథానాయిక అయినా గ్లామరెస్ గా ఉంటే బెటర్ అని పవన్ అండ్ కో భావిస్తోంది.
అందుకే.. ఓ ముద్దుగుమ్మని వెదికి పట్టుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ పాత్రలో రకుల్ కనిపిస్తుందని అప్పట్లో చెప్పుకొన్నారు. అయితే రకుల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె కాల్షీట్లు అంత ఈజీగా దొరకవు. సో… రకుల్ లా మిలమిలమెరిసే మరోనాయికని వెదికి పట్టుకోవాల్సిందే.