దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడైన ఆకాష్, వెండితెరపై అవకాశాలు బాగానే దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోల చిన్నప్పటి పాత్రల్లో కన్పిస్తోన్న ఆకాష్, తాజాగా ఓ సీనియర్ హీరో సినిమాలో చిన్ననాటి పాత్రలో కన్పించబోతున్నాడు. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ‘లెజెండ్’ సినిమాలో ఆకాష్, చిన్ననాటి బాలకృష్ణగా కన్పించబోతున్నాడట. నటుడిగా ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్న ఆకాష్‌కి, ‘లెజెండ్’లో పాత్ర సరికొత్త గుర్తింపు తెచ్చిపెడ్తుందని అంటున్నారు.
ఈ వార్తల్లో నిజమెంతోగానీ, తెరపై ఈజ్‌తో కన్పించే ఆకాష్ బాల నటుడిగా అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడన్నది నిర్వివాదాంశం. ‘గబ్బర్‌సింగ్’, ‘బుజ్జిగాడు’, ‘చిరుత’ సినిమాల్లో ఆకాష్ బాల నటుడిగా కన్పించిన విషయం విదితమే.