సర్కారు..ఆంధ్ర..యాభై కోట్ల పై మాటే

సర్కారు వారి పాట బిజినెస్ మొదలయింది. ఇప్పటికే నైజాం 30 కోట్లు ప్లస్ జి ఎస్ టి లెక్కన క్లోజ్ చేసారు. నిజానికి మైత్రీ సంస్థ బిజినెస్ కోసం కొత్తగా ప్రయత్నం చేయక్కరలేదు. రెగ్యులర్…

సర్కారు వారి పాట బిజినెస్ మొదలయింది. ఇప్పటికే నైజాం 30 కోట్లు ప్లస్ జి ఎస్ టి లెక్కన క్లోజ్ చేసారు. నిజానికి మైత్రీ సంస్థ బిజినెస్ కోసం కొత్తగా ప్రయత్నం చేయక్కరలేదు. రెగ్యులర్ బయ్యర్లు వున్నారు. ఎంత చెబితే అంతకు ఓకె అని, అడ్వాన్స్ లు పంపిస్తారు. అమౌంట్ లు కడతారు. తేడా వస్తే వెనక్కు ఇస్తారనే నమ్మకం తెచ్చుకుంది మైత్రీ సంస్థ. అందువల్ల పెద్దగా ముందు వెనుక ఆడరు బయ్యర్లు. అయితే రేటు, లెక్క అనేది ఒకటి వుంటుంది.

ఆంధ్ర ఏరియాకు సర్కారు వారి పాట ను 50 కోట్ల రేంజ్ లో కోట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రలో రేట్లు వచ్చిన తరువాత వస్తున్న పెద్ద హీరో సినిమా ఇదే. ఆర్ఆర్ఆర్ వ్యవహారం వేరే. దాన్ని రెగ్యులర్ సినిమాల లెక్కలో వేయడానికి లేదు. రేట్లు పెరగడానికి ముందు వచ్చాయి పుష్ప..భీమ్లా నాయక్ వంటి సినిమాలు. అప్పటికీ పుష్ప సినిమాను గట్టి రేటుకే ఇచ్చారు.

కానీ ఇప్పుడు రేట్లు వచ్చాయి కనుక లెక్కలు మారతాయి. పైగా అదనపు రేటు తెచ్చుకునే అవకాశం కూడా వుంది. అందుకే సర్కారు వారి పాట ఆంధ్ర రేటు 50 కోట్లకు పైగానే వుంటుందని బయ్యర్ల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన సీడెడ్ ఏ రేంజ్ లో కోట్ చేస్తారో చూడాల్సి వుంది. 

ఇప్పటికే మైత్రీ నుంచి పుష్ప సినిమాకు గాను బయ్యర్లకు కొంత రిటర్న్ రావాల్సి వుంది. ఇప్పుడు ఆ లెక్కలు అన్నీ సర్కారు వారి పాటతో రైటాఫ్ అయిపోయే అవకాశం వుంది.