రామ్ సినిమాలో సీనియర్ హీరో!

రామ్ పోతినేని సినిమాకు హీరో కావాలి. అదేంటీ రామ్ సినిమాకు హీరో ఏంటీ? రామ్ నిర్మాతగా సినిమా తీస్తున్నారా? అనుకోవద్దు. మైత్రీ సంస్థలో రామ్ చేయబోయే సినిమాలో మరో హీరో వుంటారు. అది కూడా…

రామ్ పోతినేని సినిమాకు హీరో కావాలి. అదేంటీ రామ్ సినిమాకు హీరో ఏంటీ? రామ్ నిర్మాతగా సినిమా తీస్తున్నారా? అనుకోవద్దు. మైత్రీ సంస్థలో రామ్ చేయబోయే సినిమాలో మరో హీరో వుంటారు. అది కూడా కాస్త సీనియర్ హీరో. ఇప్పుడు ఆ హీరో పాత్ర చేసే వాళ్లు కావాలి. అంటే సినిమాలో సినిమా కథ వుంటుదన్నమాట.

సినిమాలో రామ్ అభిమానించే అభిమాన హీరో పాత్ర వుంటుంది. ఆ పాత్ర చాలా కీలకం. అయితే అలా అని ఇలా వచ్చి అలా మాయం అయ్యే పాత్ర కాదని తెలుస్తోంది. దీనికి ఓ సీనియర్ హీరో కావాలి.

ఇప్పటికే మైత్రీలో సినిమా చేసిన ఓ సీనియర్ హీరోని అడిగినట్లు, కానీ ఆయన నో అన్నట్లు తెలుస్తోంది. రామ్ పాత్ర అభిమానించే హీరో పాత్ర అన్నపుడు, అది సినిమాకు కీలకం అయినప్పుడు ఆ రేంజ్ వాళ్లు కావాలి. అదే ఇప్పుడు సమస్య.

అందుకోసమే ఎవరు, ఎలా అనే డిస్కషన్లు సాగుతున్నట్లు తెలుస్తోంది. లేదంటే ఇంక కథ మరే విధంగానైనా మార్చుకుంటారేమో చూడాలి. ఈ సినిమాను కొత్త దర్శకుడు మహేష్ అందిస్తున్నారు.

11 Replies to “రామ్ సినిమాలో సీనియర్ హీరో!”

  1. అంటే సీనియర్లు అందరూ(ఒక్కరినే అడిగారని చెప్పారు ఇక్కడ) ఈ సినిమాలో నటించకుండా తప్పించుకుంటున్నారు అని మీ ఉద్దేశమా?

    రామ్ రేంజ్ కి తన అభిమాన హీరో రోల్ లో నరేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, సునీల్, సుధాకర్ లాంటి వాళ్ళు చేస్తేనే ఎక్కువ…

Comments are closed.