‘సరిపోదా శనివారం’.. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్. నాని యాక్టింగ్ కు ఎప్పట్లానే మంచి మార్కులు పడగా.. ఎస్ జే సూర్య నటనకు మాత్రం తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. నానీని మించి సూర్యాను మెచ్చుకున్న సందర్భాలు అనేకం.
అలా ‘సరిపోదా శనివారం’ సినిమాతో టాలీవుడ్ లో పాతుకుపోయిన సూర్య.. ఇంకా ఆ మత్తు నుంచి బయటకొచ్చినట్టు లేదు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ కోసం వర్క్ చేస్తున్నాడు. అయినప్పటికీ నాని సినిమా డైలాగ్స్ ను అతడింకా వదల్లేదు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి లక్నోలో ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. అక్కడ సినిమా గురించి మాట్లాడమని మైక్ ఇచ్చారు. మైక్ పుచ్చుకున్న సూర్య.. ‘సరిపోదా శనివారం’ సినిమాలోని తన ఫేవరెట్ డైలాగ్ ను వినిపించాడు.
ఆ సినిమా గురించి నార్త్ జనాలకు పెద్దగా తెలియదు. ఎందుకంటే ఉత్తరాదిన ‘సరిపోదా శనివారం’ సినిమా పెద్దగా రిలీజవ్వలేదు. విడుదలైన సెంటర్లలో కూడా ఎక్కువమంది చూడలేదు. అక్కడితో అయిపోయిందనుకులోపే మరోసారి అదే సినిమాను గుర్తుచేశాడు సూర్య. ఈసారి కూడా గేమ్ ఛేంజర్ సంగతే.
గేమ్ ఛేంజర్ కు సంబంధించి 2 కీలకమైన సన్నివేశాల డబ్బింగ్ పూర్తిచేశాడు సూర్య. రామ్ చరణ్ తో ఓ సీన్, శ్రీకాంత్ తో మరో సీన్ డబ్బింగ్ పూర్తిచేయడానికి తనకు పూర్తిగా 3 రోజులు పట్టిందని తెలిపాడు.
సీన్లు అద్భుతంగా వచ్చాయని, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందంటూనే.. “పోతారు.. మొత్తం పోతారు” అనే డైలాగ్ ను వాడాడు. ఇలా గేమ్ ఛేంజర్ సినిమాలో ‘సరిపోదా శనివారం’ సినిమాను అడుగడుగునా గుర్తు చేస్తున్నాడు ఎస్ జే సూర్య.
vc available 9380537747
ఆంధ్ర ప్యాలస్ లేక బెంగళూరు ప్యాలస్ లోనే నే నా ?
Call boy works 9989793850
Call boy jobs available 7997531004