కలిసే ఛాన్స్ లేదు.. విడాకులే కావాలి

తాజా పరిణామంతో ధనుష్-ఐశ్వర్య ఇక కలిసే ఛాన్స్ లేదని, విడాకులు దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు లాయర్లు.

హీరో ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకుల వ్యవహారం కొలిక్కి వచ్చింది. వీళ్లిద్దరూ కలిసే ఛాన్స్ ఉందని, స్వయంగా రజనీకాంత్ రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పని ఈరోజు తేలిపోయింది.

చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు ఈరోజు ధనుష్, ఐశ్వర్య విడివిడిగా హాజరయ్యారు. ఇద్దరు మాస్కులు ధరించి, తమ లాయర్లతో ఎవరికి వారు కోర్టు హాల్ లోకి ఎంటరయ్యారు. ఇక తామిద్దరం కలిసే అవకాశం లేదని, విడాకులు మంజూరు చేయాలంటూ తుది డిక్లరేషన్ సమర్పించారు.

వీళ్ల విడాకుల కేసుకు సంబందించి ఇది మూడో వాయిదా. ఇంతకుముందు జరిగిన 2 వాయిదాలకు వీళ్లిద్దరూ హాజరుకాలేదు. చివరిదైన మూడో వాయిదాకు వ్యక్తిగతంగా హాజరై, డిక్లరేషన్ ఇచ్చారు. కేసును 27వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజు విడాకులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.

తాజా పరిణామంతో ధనుష్-ఐశ్వర్య ఇక కలిసే ఛాన్స్ లేదని, విడాకులు దాదాపు ఖరారైనట్టేనని అంటున్నారు లాయర్లు.

18 ఏళ్లు కలిసి కాపురం చేశారు ధనుష్-ఐశ్వర్య. వీళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతలోనే ఏమైందో ఏమో, 2022లో విడిపోతున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం ఐశ్వర్య, పోయెస్ గార్డెన్ లోని తన తండ్రి రజనీకాంత్ నివాసంలోనే ఉంటోంది. అటు ధనుష్ కూడా తాజాగా పోయెస్ గార్డెన్ లో ఓ భారీ భవంతిని కొనుగోలు చేశాడు. త్వరలోనే అందులోకి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.

17 Replies to “కలిసే ఛాన్స్ లేదు.. విడాకులే కావాలి”

      1. మన GA అన్ని కామెంట్లు మోడరేట్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. ఇలాటివి మాత్రం పట్టించుకోడు

      2. ఆది మన ప్యాలస్ పులకేశి సైడ్ బిజినెస్.

        గంటకి 100 రూపాయలు ఇస్తే ఫోన్ లో న్ అన్ని చూపిస్తాడు.

        రోజు లో చివర్లో కనీసం లక్ష డబ్బు చూపించకపోతే ఇంట్లో అన్నం పెట్టదు. అతని బాధలు అతనివ్వి.

      3. ప్యాలస్ పులకేశి గాడి సైడ్ బిజి*నెస్ అది. అందుకే వెనక*టి రెడ్డి గారు ఆ కా*మెంట్ నీ తప్పని సరిగా అన్నిట్లో పెడతారు. వచ్చిన డబ్బులో కొంత్వ వాటా కోసం. ప్యాలస్ పులకేశి అపాయింట్మెంట్ కావాలి ఆంటే సొంత డొక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళకి కూడా డబ్బు కడితేనే అవకాశం. అదీ ప్యాలస్ పులకేశి డబ్బు యావ.

Comments are closed.