Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సోలో సినిమాకు మల్టీస్టారర్ కవరింగ్

సోలో సినిమాకు మల్టీస్టారర్ కవరింగ్

దిల్ రాజు బ్యానర్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ సినిమా చేయాలి. ఆ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సుధీర్ బాబు, నాని హీరోలుగా ఆ సినిమా రాబోతోంది. దీనికి వ్యూహం అనే టైటిల్ పెట్టినట్టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు సంబందించి మరో ఎక్స్ క్లూజివ్ న్యూస్.

నిజానికి ఈ సినిమా మల్టీస్టారర్ ప్రాజెక్టు కాదని తెలుస్తోంది. సినిమాలో ఎక్కువభాగం సుధీర్ బాబే కనిపిస్తాడు. ఓ కీలకమైన పాత్రలో నాని కనిపిస్తాడట. ఇంకా చెప్పాలంటే సినిమాలో నాని పోర్షన్ 15-20 నిమిషాలు మధ్య మాత్రమే ఉంటుందట. మిగతా షో మొత్తం సుధీర్ బాబుదే. కానీ మార్కెట్ కోసం ఈ మూవీని మల్టీస్టారర్ సినిమాగా ప్రచారం చేస్తున్నారట.

గతంలో అధిపతి, ఎవడు లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. అధిపతిలో నాగార్జునది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. అలాగే ఎవడు సినిమాలో బన్నీది కూడా పూర్తిస్థాయి పాత్రకాదు. కానీ ఈ రెండు సినిమాల్ని అప్పట్లో మల్టీస్టారర్స్ గానే మార్కెట్ చేశారు. అదే పద్ధతిని ఇప్పుడు వ్యూహం సినిమా కోసం కూడా అనుసరించబోతున్నారు.

ఈ మూవీలో నటించడంతో పాటు దిల్ రాజుతో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడట నాని. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. మహర్షి మూవీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత 'వ్యూహం' ఖరారవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?