సూర్య వెర్సస్ సూర్య…సినిమా సంగతి ఎలా వున్నా, నిర్మాతకు మాత్రం టేబుల్ ప్రాఫిట్ అందించింది. కార్తికేయ తెచ్చిన క్రేజ్ పుణ్యమా అని మంచి బిజినెస్ చేసుకున్నారు. అయితే శాటిలైట్ అయిందని కొందరు..కాలేదని కొందరు చెబుతున్నారు.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం మంచి రేటుకు శాటిలైట్ అయ్యే అవకాశాన్ని నిర్మాత చేజార్చుకున్నట్లు వినికిడి. నిజానికి కార్తికేయకు అద్భుతమైన టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జెమిని టీవీ వాళ్లు సూర్య వెర్సస్ సూర్య హక్కుల కోసం వాళ్లంతట వాళ్లే ముందుకు వచ్చారు. నిర్మాత మూడు కోట్లు రేటు చెప్పారని వినికిడి. జెమిని వారు..రెండు నుంచి రెండు పాతిక వరకు వెళ్లారు. డీల్ సెట్ కాలేదు.
కొద్ది రోజుల క్రితం జీ టీవీ వారికి సినిమా చూపించినట్లు, వారు తమకు వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సినిమాకు సరైన టాక్ రాలేదు. దీంతో మరి నిర్మాత చెప్పిన మూడు కోట్ల రేటు ఎలాగూ రాదు. కనీసం ముందు అనుకున్న రెండు పాతిక వచ్చినా లాభమే. ఎందుకంటే థియేటర్ రైట్లు మంచి రేటుకు వెళ్లాయి..ఓవర్ సీస్ 60-40 రేటుకు ఇచ్చారు. అందువల్ల శాటిలైట్ బోనస్ అవుతుంది.