Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సైరా ఫిక్స్ అయింది

సైరా ఫిక్స్ అయింది

మెగాస్టార్ మెగా మూవీ సైరా. ఈ సినిమా విడుదల డేట్ అక్టోబర్ 2నే వుంటుందని గ్రేట్ ఆంధ్ర గతంలోనే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ డేట్ నే చిత్ర యూనిట్ ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాకు బ్యాలెన్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సిజి వర్క్ పని స్పీడ్ అన్నీ గమనించి, లెక్కలు వేసుకుని, అక్టోబర్ 2న రావడానికి మార్గం సుగమమే అని యూనిట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సినిమా విడుదల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ప్రచారాల షెడ్యూలు, ప్రచారానికి కావాల్సిన వ్యవహారాలు రూపొందించే పని మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వ్యయంతో రూపొందిస్తున్న చిత్రం ఇది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా అమితాబ్ కీలకపాత్ర పోషించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?