తెరపై కోన వెంకట్

రచయిత కోన వెంకట్ తెర ముందుకు వస్తున్నారని అనుకోనక్కరలేదు. ఆ లోటను బ్రహ్మానందం తీర్చేస్తున్నాడట.  కోనవెంకట్ స్టయిల్ క్యారెక్టర్ ను బ్రహ్మీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’లో పోషించాడు. ‘నా పేరు కోన వెంకట్’ అని…

రచయిత కోన వెంకట్ తెర ముందుకు వస్తున్నారని అనుకోనక్కరలేదు. ఆ లోటను బ్రహ్మానందం తీర్చేస్తున్నాడట.  కోనవెంకట్ స్టయిల్ క్యారెక్టర్ ను బ్రహ్మీ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’లో పోషించాడు. ‘నా పేరు కోన వెంకట్’ అని ఇప్పటికే ట్రయిలర్లలో పలకరించాడు. 

దీని వెనకు చాలా కథ జరిగిందట. కోనకు చెప్పే ఈ క్యారెక్టర్ తయారుచేసి, వాడారు. కానీ అన్నీ అయ్యాక సెన్సారు నో అందట..దాంతో కోన వెంకట్ కు అభ్యంతరం లేదు అని చెప్పినా ససే మిరా అందట. అప్పుడు కోన వెంకట్ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ తెచ్చి ఇస్తే, సరే అందిట. మరి అన్ని పుర్రాకులు పడి రూపోందించిన క్యారెక్టర్ లో బ్రహ్మీ ఏ మేరకు దున్నేస్తాడో చూడాలి మరి. 

కోన వెంకట్ పాపులారిటీని జనాలు బాగానే వాడుతున్నారు. మొన్నటికి మొన్న దిక్కులు చూడకు రామయ్యా  డబ్బింగ్ చెబుతూ ఆలీ, స్క్రిప్ట్ లో లేకున్నా, ఇది జుట్టా..కోన వెంకట్ విగ్గా అని డైలాగ్ వేసాడట. నిర్మాత విని అనవసరం తలకాయ నొప్పి అని తీయించేసాడట. కోన వెంకట్ క్రేజ్ బాగానే పట్టింది సినిమా జనాలకు.