టాలీవుడ్ లోకి నేహాశర్మ చెల్లెలు?

చిరుత హీరోయిన్ నేహా శర్మ గుర్తుందిగా..రామ్ చరణ్ తో బోలెడ్ గ్యాసిప్ లు పంచుకుంది. ఇప్పుడా అమ్మడు చెల్లెలు ఐషా శర్మ కూడా టాలీవుడ్ వైపు చూస్తోంది. వాస్తవానికి ఈ అమ్మడు ఇంతకు ముందే…

చిరుత హీరోయిన్ నేహా శర్మ గుర్తుందిగా..రామ్ చరణ్ తో బోలెడ్ గ్యాసిప్ లు పంచుకుంది. ఇప్పుడా అమ్మడు చెల్లెలు ఐషా శర్మ కూడా టాలీవుడ్ వైపు చూస్తోంది. వాస్తవానికి ఈ అమ్మడు ఇంతకు ముందే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది..రామ్ సినిమా శివమ్ లో హీరోయిన్ గా. కానీ ఎందుకో మిస్సయింది. 

ఇప్పుడు మళ్లీ మరోసారి ఈ అమ్మాయి డిస్కషన్ లోకి వచ్చింది. నాగ్ చైతన్య చేస్తున్న మజ్ఞు సినిమాలో మూడో క్యారెక్టర్ కు ఈ అమ్మాయి అయితే ఎలా వుంటుందీ అన్న విషయం పై ఇప్పుడు యూనిట్ లో చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క దిశాపటానీ పేరు కూడా వుండనే వుంది. 

కానీ ఈ అమ్మాయి అయితే ఫస్ట్ మూవీగా వుంటుంది అని అనుకుంటున్నారు. చాలా మంది ఏక్టర్లను, మోడళ్లను వడపోసిన తరువాత, ఐషాశర్మ.. దిశాపటానీల మధ్య టాస్ వేసే వరకు వచ్చింది. ఎవరిని వరిస్తుందో..చై పక్కన హీరోయిన్ పాత్ర. ఇప్పటికే ఆ సినిమాలో శృతి, అనుపమ ఇద్దరు హీరోయిన్లు వున్నారు.