మాటల రచయితగా త్రివిక్రమ్ ఎంత లబ్ద ప్రతిష్టుడో అందరికీ తెలిసిందే. మాటల రచయితగా ప్రారంభమై, పాతిక కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే దర్శకుడిగా ఎదిగారు. అయినా ఆయన అడపా దడపా మాటల రచయిత అవతారం ఎత్తుతూనే వున్నారు.
తీన్ మార్ కు మాటలు అందించారు. అయ్యప్పన్ కోషియన్ రీమేక్ కు అందిస్తున్నారు. వకీల్ సాబ్ కు కూడా అందించాల్సి వుంది కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. లేటెస్ట్ గా అల్లు అరవింద్ నిర్మించే రామాయణం సినిమాకు మాటలు అందిస్తున్నారు.
ఇదిలా వుంటే 2020 మార్చిలో ఓ సంఘటన జరిగిందని ఆలస్యంగా తెలిసింది. దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ తాను నిర్మించబోయే హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది.
అయితే దీనికి ఎస్ లేదా నో రెండూ త్రివిక్రమ్ చెప్పలేదు. చూద్దాం అన్నట్లుగా బదులిచ్చి వదిలేసారని తెలుస్తోంది. అయితే మళ్లీ గుణశేఖర్ యాక్టివ్ గా ఆ విషయం ముందుకు తీసుకురాలేదని తెలుస్తోంది.
రానా ప్రధాన పాత్రధారిగా హిరణ్య కశ్యప సినిమా ప్లాన్ చేసారు.రానా ప్రస్తుతం ఫుల్ బిజీగా వున్నారు. అందువల్ల హిరణ్య కశ్యప ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది క్లారిటీ లేదు.
బహుశా అందువల్లనే గుణశేఖర్ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించడం అన్నది అబేయన్స్ లో పడిందేమో?