నాని నటించిన V మూవీ లాక్ డౌన్ టైమ్ లో నేరుగా ఓటీటీలో రిలీజైంది. భారీ హైప్ మధ్య రిలీజైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ రివెంజ్ డ్రామా అనిపించుకుంది.
ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాల్లో ఎక్కువమంది వీక్షించిన మూవీగా ఇది నిలిచినప్పటికీ.. హిట్ టాక్ మాత్రం రాలేదు. ఇప్పుడీ సినిమా బుల్లితెరపై కూడా ఫెయిలైంది.
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా తాజాగా జెమినీ టీవీలో ఈ సినిమాను ప్రసారం చేస్తే.. కేవలం 6.8 రేటింగ్ మాత్రమే వచ్చింది. అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల టీఆర్పీలతో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కనీసం నాని గత సినిమాలతో పోల్చి చూసినా ఇది తక్కువ రేటింగ్ కిందే లెక్క.
నాని గత చిత్రం గ్యాంగ్ లీడర్ కు 8.6 టీఆర్పీ రాగా.. అంతకంటే ముందు నటించిన జెర్సీ సినిమాకు 8.8 రేటింగ్ వచ్చింది. దాని ముందు సినిమా దేవదాస్ కు కూడా 8.3 టీఆర్పీ వచ్చింది. వీటితో పోల్చి చూస్తే V సినిమా స్మాల్ స్క్రీన్ పై ఫెయిల్ అయినట్టే లెక్క.
బహుశా.. నానిని నెగెటివ్ రోల్ లో బుల్లితెర వీక్షకులు జీర్ణించుకోలేకపోయారేమో. నాని, సుధీర్ బాబు నటించిన ఈ మల్టీస్టారర్ ను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించాడు.
సరిగ్గా థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్న కొన్ని రోజుల ముందు లాక్ డౌన్ పడింది. ఆ తర్వాత చాన్నాళ్లు ఎదురుచూసి, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో రిలీజ్ చేశారు. అన్నట్టు ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో కూడా విడుదలకాబోతోంది.