యువి నుంచి రెండు సినిమాలు ఫిక్స్

రన్ రాజా రన్, మిర్చి వంటి రెండు హిట్ లు కొట్టిన యువి క్రియేషన్స్ సంస్థ మరో సినిమా గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఇది…

రన్ రాజా రన్, మిర్చి వంటి రెండు హిట్ లు కొట్టిన యువి క్రియేషన్స్ సంస్థ మరో సినిమా గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఇది కూడా ప్రొడక్షన్ నాలుగు, అయిదు కూడా రెడీ చేసేసింది. 

ప్రొడక్షన్ నాలుగు మారుతి దర్శకత్వంలో నాని హీరోగా ఒక డిఫరెంట్ సినిమా జనవరి నుంచి, ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో మరో సినిమా ఏప్రిల్ నుంచి ప్రారంభించబోతున్నారు. నాని సినిమా లవ్, రొమాంటిక్ థ్రిల్లర్ గా వుంటుంది. ప్రభాస్ సినిమా ఫన్ ఓరియెంటెడ్ గా వుంటుంది. 

మారుతి సినిమాకు ఇటు నాగచైతన్య, అటు గోపీచంద్ ల పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి కానీ ఆఖరికి నాని దగ్గరే ఫిక్స్ అయ్యారు. ఈ రెండు సినిమాలకు కూడా ఇంకా హీరోయిన్లు ఖరారు కావాల్సి వుంది. నాని సినిమాకు స్క్రిప్ట్ రెడీ. ప్రభాస్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది