ఆ మధ్య హోరా హోరీ సినిమా ఫంక్షన్ లో దర్శకుడు తేజ ఒక్కసారి బరస్ట్ అయ్యారు. తాను ఎన్ని సినిమాలు తీసినా జయం సినిమాతోనే పోలుస్తున్నారంటూ. నిజానికి ప్రతి దర్శకుడికి ఓ మేకింగ్ స్టయిల్ వుంటుంది. అది మారదు. దాని వల్ల ఆ దర్శకుడి పాత సినిమాలు గుర్తుకు రావడం సహజం. అయితే ఈ సారి దర్శకుడు తేజ తీస్తున్న హోరా హోరీ నిజంగానే జయం మాదిరిగా వుండదట. ఎందుకంటే ఆయన ఈసారి తన సినిమాను స్పూర్తిగా తీసుకున్నట్లు లేదు. పక్కవాళ్ల సినిమాల నుంచి స్ఫూర్తిపోందినట్లు వుంది.
ఇంతకీ హోరా హోరీ కథేంటంటే…అనగనగా ఓ హీరో, ఓ విలన్. హీరోకి విలన్ కు పరిచయం వుంటుంది అది వేరే సంగతి. విలన్ బారి నుంచి తప్పించుకు వచ్చిన హీరోయిన్ కాస్తా, హీరోకి పరిచయమై, అతని ప్రేమలో పడుతుంది. కానీ తీరాచూస్తే అతను ఎవరో కాదు విలన్ కు తెలుసున్నావాడే. దీంతో ఇద్దరూ ఢీకొనే పరిస్థితి. చివరకు ఏమయింది.
ఈ కథ వింటే, ఒక్కడు, వర్షం సినిమాలు గుర్తుకు వస్తే, అది వేరే సంగతి. కానీ ఈ కథ తేజ మేకింగ్ స్టయిల్ లో చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా తేజ బేసిక్ గా సినిమాటోగ్రాఫర్ కూడా కావడంతో, వర్షంలో, సౌత్ కర్ణాటక ప్రాంత అందాలు బాగా కనువిందు చేస్తాయని తెలుస్తోంది. బహుశా ఈ నెల 14న విడుదల కావచ్చు ఈ సినిమా.