cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

విగ్రహాలు-పూజలు-పాలాభిషేకాలు

విగ్రహాలు-పూజలు-పాలాభిషేకాలు

చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నది సామెత. రాను రాను ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం అలాగే తయారవుతోంది. ఆరంభంలో ఎన్టీఆర్ బయోపిక్ వ్యవహారం మామూలుగానే వుంది. కానీ క్రిష్ డైరక్టర్ గా వచ్చి చేరాక, దాని గమనం, గమ్యం మారిపోయాయి.

ఓ యుగ పురుషుడు, తెలుగు జాతిని ఉద్దరించడానికి పుట్టిన మహానుభావుడు, అన్నట్లు ప్రచారం మెల్లగా ప్రారంభించారు. అది అలా అలా మరింత పెరిగి, వెంకటేశ్వరుడి గెటప్ లో బాలయ్య ను చూపించి, సాక్షాత్తూ దేవుడే అన్న లెవెల్ కు చేర్చేసారు.

ఇప్పుడు ప్రపంచంలోని తెలుగువారంతా ఈ ఎన్టీఆర్ బయోపిక్ చూడకపోతే మహాపరాధం అనే రేంజ్ లో హడావుడి చేస్తున్నారు. దీనికితోడు ఇప్పుడు వంద థియేటర్ల వద్ద ఎన్టీఆర్ విగ్రహాలు పెడతారట. విగ్రహాలు పెట్టి ఊరుకోరు కదా? దీపాలు, పూలదండలు, ఇంకా అభిమానం ఎక్కువైతే పాలాభిషేకాలు కూడా వుంటాయేమో? అదేమీ అబ్బురం కాదు.

హీరోలు బతికి వుండగానే వాళ్ల సినిమాలు విడుదలయితే పాలాభిషేకాలు చేసే వ్యవహారం కామన్ కదా? ఎటొచ్చీ ఎవరికీ పూనకాలు రాకుంటే బెటర్. పొరపాటున పూనకాలు వచ్చి, ఎవరైనా ఆ ఊపున ఏదేదో మాట్లాడితే అదో హడావుడి అయిపోతుంది.

జనసేన అన్ని స్థానాల్లో పోటీ పవన్ కళ్యాణ్ ధైర్యమేంటి?

అటు జనం.. ఇటు భయం, పవన్ ఒంటరిగా వెళ్లాలి.. ఇదే అభిమానుల కోరిక!