సురేష్ కొండేటి 'మహేష్'లో వేళ్లు పెట్టి 60 లక్షలు వరకు నష్టం మూటకట్టుకుంది మారుతి గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్. ఇప్పుడు విల్లాతో ఆ నష్టం కొంతయినా పూడుతుందనే ఆశతో వుంది. విల్లా సినిమాకు తమిళనాట మంచి టాక్ రావడం, ఇక్కడ కూడా ప్రీమియర్ షో చూసిన వారంతా పాజిటిక్ టాక్ ఇవ్వడంతో ఈ ఆశ నెరవేరేలాగే వుంది.
విల్లా టేబుల్ ప్రాఫిట్ తో విడుదలయింది. అంతా కలిసి ఎనభై నుంచి తొంభైతో రెడీ అయిపోయింది. శాటిలైట్ తోనే మూడు వంతులు వచ్చేసింది. ఇప్పుడు ఏ మాత్రం సక్సెస్ అయినా 'మహేష్' నష్టం పూడ్చేస్తుంది.
సరియైన సినిమా మాట దేవుడెరుగు, అసలు సినిమాలే పెద్దగా లేకపోవడం కలిసొచ్చే అంశం. కానీ ఒకటే అనుమానం ఇకనైనా గుడ్ ఫ్రెండ్స్ అక్కర్లేని డబ్బింగ్ సినిమాల జోలికి వెళ్లి చేతులు కాల్చుకోకుండా వుంటారా అన్నది?