నీది తెనాలే.నాది తెనాలే

మసాలా ఫలితం చూసి, సంతోషించేవారెవరైనా వున్నారా అంటే చాలా మందే వున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఫ్లాపైన భారీ సినిమాలకు చెందిన యూనిట్ జనాలు, మసాల చూసి, తమ తమ సినిమాలే బెటరనుకుంటున్నాయి.  Advertisement మాకు…

మసాలా ఫలితం చూసి, సంతోషించేవారెవరైనా వున్నారా అంటే చాలా మందే వున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఫ్లాపైన భారీ సినిమాలకు చెందిన యూనిట్ జనాలు, మసాల చూసి, తమ తమ సినిమాలే బెటరనుకుంటున్నాయి. 

మాకు కనీసం ఓపెనింగ్స్ అయినా దక్కాయి మసాలా కు అదీ లేదు అని రామయ్య వస్తావయ్యా, భాయ్ టీమ్ లు గుసగుసలు పోతున్నాయి. మసాలా రెండో రోజు మల్టీ ఫ్లెక్స్ ల్లో ఓకటి రెండు షో లు కోత పడినట్లు బోగట్టా. 

ఇదిలా వుంటే వెంకటేష్ సంగతి పక్కన పెడితే, రామ్ కెరియర్ అనుమానంలో పడిపోయింది. ఇప్పటికే ముచ్చటగా మూడు ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. పైగా ఇలాంటి సెకెండ్ హీరో క్యారెక్టర్ లో నటించాడు.  స్వంత బ్యానర్ పై మళ్లీ ఏదో ఒకటి చేసి, హిట్ కొడితే తప్ప, కెరియర్ గాడిలో పడడం కష్టం.