అల్లు అరవింద్ చిన్న సినిమాలు తీయాలని డిసైడై పోయి, కమిషన్ నిర్మాత గా బన్నీ వాసును పెట్టకున్నారన్న వార్త వెలువడగానే, ఇందుకు నేపథ్యం ఏమై వుంటుందన్న గుసగుసలు బయల్దేరాయి. అయితే ఇది చిన్న సినిమాలపై ప్రేమతో కాదని, పెద్ద సినిమాలు తీసే అవకాశాలు పెద్దగా లేకనే అని అనుకుంటున్నారు.
గీతాఆర్ట్స్ అంటే భారీ సినిమాలే కాదు గతంలో చిన్న సినిమాలు కూడా చేసింది. అయితే వాటి సంఖ్య చాలా తక్కువ. కానీ ఇప్పుడు వాటి వైపే మొగ్గడానికి కారణం మెగా హీరోలు అందుబాటులో లేకపోవడమే అని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రెండు మూడు ప్రాజెక్టులు కమిట్ అయి వున్నారు. అందులో ఒకటి తన సన్నిహితుడు శరద్ మురార్ కు. రెండవది పివిపి వారికి. మూడవది వుంటే భోగవల్లి ప్రసాద్ కు. ఇక రామ్ చరణ్ ఓ ప్రాజెక్ట్ ను బండ్ల గణేష్ కు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ ప్రాజెక్ట్ లు ఏమిటో, వాటి సంగతేమిటో అంతా అయోమయం. అదీ గాక ఈ ఇద్దరి సినిమాలు కూడా వీర హైప్ తీసుకువచ్చి, మొదటి వారంలో నొల్లుకోవడం తప్ప , స్థిరంగా నిల్చునే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే చిన్న సినిమాలే బెటర్ అని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.