ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ గ్యాసిప్ లు వస్తూనే వుంటాయి టాలీవుడ్ లో. అది సహజం. అది మీడియాలో క్యారీ కావడం అంతకన్నా సహజం. హీరో రవితేజ రెమ్యూనిరేషన్ దగ్గర పట్టుదలతో వుంటాడన్న సంగతి తెలిసిందే. ఖిలాడీ సినిమా టైమ్ లో జరిగిన వ్యవహారాలూ తెలిసినవే.
అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడంతో ఇక్కడ కూడా అలాంటి వ్యవహారమే వుందంటూ గ్యాసిప్ లు పుట్టుకు వచ్చేసాయి. హీరో డబ్బులు ఇవ్వకుండా డబ్బింగ్ చెప్పనన్నాడు అంటూ గ్యాసిప్ లు గుప్పుమనేసాయి.
కానీ గమ్మత్తేమిటంటే ఈ గ్యాసిప్ లు పుట్టించిన వారికి అసలు విషయం తెలియదు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ కూడా లాభాల భాగస్వామి అన్నది అసలు విషయం. నిర్మాణ సమయంలో అయిదు కోట్ల వరకు తీసుకునేలా, ఆ తరువాత లాభాల్లో వాటా తీసుకునేలా ఒప్పందం వుందని తెలుస్తోంది.
నిర్మాత సుధాకర్ హీరో రవితేజ మంచి మిత్రులు అందుకే ఈ తరహా పద్దతిలో రవితేజ సినిమా చేసాడని తెలుస్తోంది.
అవసరం అయితే సింగిల్ పేమెంట్ ఇస్తా అంటే తరువాత చూసుకుందాం లెక్కలు అని రవితేజ ఈ లాభాల ఒప్పందం చేసుకున్నాడని తెలుస్తోంది. ఇది తెలియక డబ్బింగ్ బాకీల గ్యాసిప్ లు వండేసారు.