కాలకూటాన్ని పీలుస్తున్న విశాఖ జనం

అభివృద్ధి చెందిన నగరాలకు ఉన్న శాపం విశాఖకు కూడా తగిలింది. విశాఖ దేశంలో కాలుష్య నగరాల జాబితాలో ఒకటిగా నిలిచింది.

అభివృద్ధి చెందిన నగరాలకు ఉన్న శాపం విశాఖకు కూడా తగిలింది. విశాఖ దేశంలో కాలుష్య నగరాల జాబితాలో ఒకటిగా నిలిచింది. పరిశ్రమలు ప్రగతి బాటన నడిచే ఈ మహా నగరం దానితో పాటు కాలుష్య కాలకూటాన్ని పంచుతోంది. విశాఖ మహానగరంలో అలవికాని కాలుష్యం ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎనర్జీ అంటే క్లీన్ ఎయిర్ తాజాగా విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది. విశాఖను అత్యంత కాలుష్య నగరాల జాబితాలో చేర్చారు.

2024 సెప్టెంబరులో చేసిన అధ్యయన ఫలితాలలో విశాఖ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని తేలింది. విశాఖ జనాలు విషపూరితమైన గాలులను పీలుస్తున్నారని, ఫలితంగా ప్రమాదకరమైన జబ్బులతో మరణాలకు చేరువ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

విశాఖకు “సిటీ ఆఫ్ డెస్టినీ”గా పేరుంది. ఈ నగరానికి రావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. పర్యాటక రంగానికి పెట్టింది పేరుగా ఉన్న నగరం. రిటైర్ అయిన వారికి విశ్రాంతిని ఇచ్చే ప్రశాంత నగరంగా కూడా చెబుతారు. అటువంటి మహానగరం ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకోవడం బాధాకరం అని అంటున్నారు.

విశాఖను కాలుష్యం నుంచి బయటపడాలంటే స్థానిక ప్రభుత్వాలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూనుకోవాలని అంటున్నారు. పర్యావరణ హితమైన కార్యక్రమాలను ప్రారంభించాలి. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కాలుష్య కారకాల్ని నియంత్రించాలి. పరిశ్రమలపై తగిన తనిఖీలు ఉండాలి.

విశాఖలో ప్రకృతిని పరిరక్షించడం ద్వారా తిరిగి నాణ్యమైన గాలిని, మంచి వాతావరణాన్ని తెచ్చుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే, ఏపీలో విశాఖతో పాటు విజయవాడ కూడా కాలుష్య నగరాల జాబితాలో ఉంది అని చెబుతున్నారు. అందువల్ల పాలకులు పూర్తిగా దృష్టి పెట్టాల్సి ఉంది అని పేర్కొంటున్నారు.

9 Replies to “కాలకూటాన్ని పీలుస్తున్న విశాఖ జనం”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. విశాఖ ఒక్కటే కాదు, కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఏ పట్టణం పరిస్థితి బాగులేదు.

Comments are closed.