Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆర్ఆర్ఆర్.. మళ్లీ మొదలైన లీకుల గోల

ఆర్ఆర్ఆర్.. మళ్లీ మొదలైన లీకుల గోల

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు లీకులు కొత్తకాదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ ఇంట్రో సీన్ తో పాటు కొన్ని స్టిల్స్ గతంలో లీక్ అయ్యాయి. ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు వీటికి అదనంగా మరికొన్ని లీకులు వచ్చాయి. నిన్నట్నుంచి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ కు సంబంధించి ఓ కీలకమైన ఫొటో బయటకు వచ్చింది. అటు బ్రిటిషర్ గెటప్ లో రామ్ చరణ్ ఉన్న స్టిల్ కూడా లీక్ అయింది. దీనికితోడు ఎన్టీఆర్ ను బ్రిటిషర్లు అరెస్ట్ చేస్తున్నప్పుడు.. హీరోయిన్ గొడవ చేసే సీన్ కు సంబంధించిన పిక్ కూడా లీక్ అయింది. మరోవైపు నిప్పుల్లో ఎన్టీఆర్ ఫైటింగ్ కు సంబంధించిన స్టిల్ కూడా ఉంది.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు అరడజను స్టిల్స్ ఒకేసారి లీక్ అవ్వడంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ తలలు పట్టుకుంది. ఈ విషయంలో రాజమౌళి ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ లీకులు ఆగలేదు.

నిజానికి ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఇలాంటి అత్యుత్సాహాల్ని నివారించేందుకు, స్వయంగా యూనిట్ ఎప్పటికప్పుడు అధికారికంగా స్టిల్స్, వీడియోలు రిలీజ్ చేస్తోంది. ఇలా చేయడం వల్ల సినిమాపై హైప్ పెరగడంతో పాటు లీకులు కూడా ఆగుతాయని భావించింది. కానీ అధికారికంగా రిలీజ్ చేస్తున్న స్టిల్స్, వీడియోస్ తో పాటు ఈ లీకులు కూడా కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ పార్ట్ షూటింగ్ నడుస్తోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్ ఆధ్వర్యంలో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది ఆర్ఆర్ఆర్. 

తానకు వెట‌క‌రం ఎక్కువగా ఉంటుంది

6 పాటలు, 6 ఫైట్ల సినిమా కాదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?