అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ఈరోజు తల్లిదండ్రులయ్యారు. అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఒక రోజు ముందే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు చేరుకున్న అలియా భట్, ఈరోజు బిడ్డకు జన్మనిచ్చింది.
ఏప్రిల్ 14న అలియా, రణబీర్ పెళ్లి చేసుకున్నారు. పూర్తిగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అలా పెళ్లి జరిగిన కొన్ని నెలలకే తను గర్భం దాల్చినట్టు స్వయంగా అలియా ప్రకటించింది. ఆ తర్వాత బేబీ షవర్ నుంచి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అప్ డేట్ చేసింది.
ఈ ఏడాది అలియా-రణబీర్ లైఫ్ బ్రహ్మాండంగా సాగింది. కెరీర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు, వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడ్డారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులుగా మారారు.
గర్భం దాల్చిన తర్వాత కూడా చాలా రోజుల పాటు ప్రమోషన్స్, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంది అలియా. ఇప్పుడు బిడ్డ కోసం కొన్ని నెలలు గ్యాప్ తీసుకోబోతోంది. చిన్న విరామం తర్వాత తిరిగి సినిమాలతో బిజీగా కాబోతోంది ఈ బ్యూటీ.