అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా? ఈరోజు అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా? ఈరోజు అతడి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చాడు బన్నీ. సాధారణ బెయిల్ పై విచారణను ఈరోజు నాంపల్లి కోర్టు వాదనలు వినబోతోంది.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు గడవు కోరడంతో, ఆ విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు, ఆ వివరాల్ని కోర్టుకు సమర్పిస్తారు. అయితే ఇది పూర్తిగా బెయిల్ కు సంబంధించిన విచారణ మాత్రమే. అతడి రిమాండ్ పై విచారణ 10వ తేదీకి వాయిదా పడింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మొత్తం 18 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఏ1 నుంచి ఏ8 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని, మేనేజర్ ను, ఏ9, ఏ10 గా సెక్యూరిటీ ఇంచార్జ్, ఫ్లోర్ ఇన్‌చార్జ్‌ను, ఏ11 గా హీరో అల్లు అర్జున్ ను, ఏ12 నుంచి ఏ17వరకు అల్లు అర్జున్‌ బౌన్సర్లను, ఏ18గా మైత్రీ మూవీమేకర్స్‌ను నిందితులుగా చేర్చారు.

కేసుకు సంబంధించి ఇప్పటికే థియేటర్ యాజమాన్యానికి పోలీసులు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా థియేటర్ యాజమాన్యం స్పందించింది. 6 పేజీల లేఖను తమ లాయర్ల ద్వారా పోలీసులకు పంపించింది. 45 ఏళ్లుగా థియేటర్ రన్ చేస్తున్నామని, అనుభవజ్ఞులైన 80 మంది సిబ్బంది తమ సొంతమని పేర్కొంది.

తమ థియేటర్ కు రెగ్యులర్ గా సినీ హీరోలు వస్తుంటారని, డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఘటన పూర్తిగా యాక్సిడెంట్ కిందకు వస్తుందని తెలిపింది. పైగా 4, 5 తేదీల్లో థియేటర్ ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఎంగేజ్ చేసుకుందని స్పష్టం చేసింది. థియేటర్ లో వసతులు, భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేవనే విషయాన్ని తమ లేఖలో తోసిపుచ్చింది సంధ్య థియేటర్ యాజమాన్యం. ఈ లేఖపై పోలీసులు ఈరోజు ఓ నిర్ణయం తీసుకోబోతున్నారు.

5 Replies to “అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా..?”

    1. అసలు పుష్పం మీరే 1…no permission for road show…

      2…didnt respond upon death news…3…repeated road show…4..=didnt send his rep to victim family next day…5…press meet conduct when case is pending…చాలా ఇంకా చెప్పాలా…

Comments are closed.