వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!

ఏది ఏమైనా జ‌గ‌న్ పిలుపుకంటే, కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై కంటే, ప్ర‌త్య‌ర్థుల అణ‌చివేత‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం వ‌ల్లే రివ‌ర్స్ అవుతోంద‌ని ప‌లువురు అంటున్నారు.

ఘోర ప‌రాజ‌యంపాలైన వైసీపీ ఇంత త్వ‌ర‌గా పోరుబాట ప‌డుతుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. మ‌రీ ముఖ్యంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దారుణ ఓట‌మి ఇచ్చిన షాక్ నుంచి తేరుకోడానికి క‌నీసం ఏడాది స‌మ‌యం ప‌డుతుంద‌ని సొంత పార్టీ వాళ్లు కూడా అనుకున్నారు. అబ్బే, అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఓట‌మిపాలైన త‌ర్వాత నెల‌లోపే జ‌గ‌న్ కోలుకున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి పాల‌న మొద‌ల‌య్యాక జ‌గ‌న్ మ‌రింత రిలాక్ష్ అయ్యారు.

వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై విచ్చ‌ల‌విడిగా దాడులు, కేసులు, వేధింపులు పెరిగాయ‌న్న అభిప్రాయం స‌మాజంలో వుంది. వైసీపీని కూట‌మి ప్ర‌భుత్వం భ‌య‌పెట్టి ఊళ్లు వ‌దిలేలా చేయాల‌ని అనుకుంది. అయితే అది కాస్త శ్రుతిమించ‌డంతో భ‌యం పోయి, తెగింపు వ‌చ్చేసింది. కూట‌మి స‌ర్కార్ అనుకున్న‌దొక‌టైతే, అందుకు విరుద్ధ‌మైన ప‌రిస్థితి నెల‌కుంది. ఇంత‌కంటే ఏమ‌వుతుందిలే అనే ధైర్యం వైసీపీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది.

దీంతో కూట‌మి స‌ర్కార్ ఆరు నెల‌ల‌కే ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌కు పాల్ప‌డుతోంద‌ని, వాటిని నిర‌సిస్తూ పోరుబాట ప‌ట్టాల‌ని జ‌గ‌న్ పిలుపు ఇచ్చారు. కేవ‌లం ఆరు నెల‌ల ప్ర‌భుత్వ పాల‌న‌పై ఆందోళ‌న‌లు అంటే తొంద‌ర‌పాటే అనే భావ‌న ఉన్న‌ప్ప‌టికీ, వైసీపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు మంచి స్పంద‌న రావ‌డం విశేషం.

ఈ నెల 13న రైతు పోరుబాట‌, 27న విద్యుత్ స‌ర్దుబాటు చార్జీల పెంపును నిర‌సిస్తూ చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. వైసీపీ నాయ‌క‌త్వం కూడా ఇంత మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. కూట‌మి స‌ర్కార్ అణ‌చివేత ఎక్కువ కావ‌డం వ‌ల్లే వైసీపీ శ్రేణులు తెగించి, రోడ్డెక్కాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వైసీపీ శ్రేణులు ఇంత త‌క్కువ స‌మ‌యంలో భారీగా రోడ్డెక్క‌డం కూట‌మికి ఆందోళ‌న క‌లిగిస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఏది ఏమైనా జ‌గ‌న్ పిలుపుకంటే, కూట‌మి స‌ర్కార్ పాల‌న‌పై కంటే, ప్ర‌త్య‌ర్థుల అణ‌చివేత‌పై ఎక్కువ దృష్టి పెట్ట‌డం వ‌ల్లే రివ‌ర్స్ అవుతోంద‌ని ప‌లువురు అంటున్నారు.

22 Replies to “వైసీపీని పోరుబాట ప‌ట్టించిన ఘ‌న‌త కూట‌మిదే!”

  1. మరి విద్యార్థి పోరు బాట ఎందుకు ఎత్తేసారు..

    ఉద్యయం అనేది ప్రజల్లో నుండి రావాలి.. తాడేపల్లి పాలస్ నుండి కాదు..

    అక్కడే మీ నాయకుడు అట్టర్ ప్లాప్..

  2. నువ్వు ఎన్ని సార్లు విద్యుత్ ధరలు పెంచావ్ గురివిందా? అయినా నువ్వు విద్యుత్ బకాయులు అలా వదిలెస్తె తరువాత వచ్చెవాళ్ళు ఎలా కడతారు?

  3. There is somuch more dirt to let go by Jagan..so many became liabilities..these dirt leaders will eventually quit or move on in the life..

    then Jagan move with his plans

  4. 5rs ki paid artist lani teeskochi taanu penchina charges paine dharna chepistunnaa neecha nikrusta button baffoon reddy… aadiki thothhu article raastunna arikatla package mundamopi reddy.

  5. ఒరేయ్ వేస్ట్ ఛానల్ గా నీ బొందర నిబొంద చార్జెస్ పెంచిందే జగన్ రా

  6. భారీగా పాల్గొన్నాయ వైసీపీ శ్రేణులు? ఎక్కడ చూపించు.. జనాలు రావట్లేదు పరువు పోతుందని విద్యార్థి పోరుబాట కేన్సిల్ చేసారు..

  7. అంత విజయవంతం ఐతే 3 న పెట్టుకున్న దీక్ష ఎందుకు రద్దు చేసుకున్నారు కనీసం వాయిదా కుడా వెయ్యకుండా

  8. రోజు గడవ లేదు విద్యార్థి దీక్ష ఎందుకు రద్దు చేసారో రాసి….ఇవ్వాళా ఇలా నిజాలు తెలిసిన ఇలా రాయడమే నా

    taటsta జర్నlism

  9. వెకిలి వెధవలకి లేకి పనలు చేయటానికి ఎవరన్నా ప్రేరేపించాలా, అది వాళ్ళ నీచ ఆలోచనలకు నిదర్శనం!!

  10. చేపలను తినే దొం గ కొంగ చాంద్రాయణ వ్రతం చేస్తున్నా.. ఇక మిమ్మల్ని తినను అని అమాయక చేపల్ని నమ్మించి చెరువు కాళీ చేసిన దొం గ కొంగలా వున్నాయ్.. జలగన్ చేసే పోరుబాటలు .!

  11. జగన్ రెడ్డి పాలనలో అసలు జనం రోడ్ మీదకు వచ్చి నిరసన చేయగలిగేరా కూటమి విజయం మీరు నచ్చనిది రోడ్ మీదకు వచ్చి నిరసన తెలియజేసే హక్కును పునరుద్ధరించింది మల్లి జగన్ గారిని తెచ్చుకొంటే రోడ్ ఉండదు సరిగదా బయటకు వచ్చి నిరసన తెలియచేస్తే శంకరగిరి మాన్యాలే అర్హత లేకపోయినా ప్రభుత్వం నుంచి డబ్బు పొందాలనుకునే వాళ్ళు గంజాయి బ్యాచ్ వస్తారు వీళ్ళ మీటింగ్ లకు రైతు నిరసనకు ఏ రైతు వచ్చాడో లేదా ఈ గంజాయి బెచ్చో వాళ్ళను చూస్తేనే తెలుస్తుంది

  12. అరే వెధవన్నర గ్యాస్ ఆంధ్ర

    అనుచివేత మొదలుపెట్టి ఉంటే ఈ ధర్నాలు జరిగేవి కాదురా వెధవ. సంవత్సరం గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటే మనుగడే ప్రశ్నార్ధకమవుతుందని ఇష్టం లేకపోయినా ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలలకే ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వస్తుందా ? మనిషన్నవాడు బుద్దున్న వాడు కడుపుకి అన్నం తినేవాడు ఎవడైనా ఇలా ఆలోచించగలడా. అయ్యగారు అధికారంలో ఉన్నప్పుడు ఏం పాలన సాగిందో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు నీలాంటి వెధవలు తప్ప. ప్రజా పాలన సాగిందా నిరంకు సత్యం సాగిందా అనేది ఎవరిని అడిగినా చెప్పగలరు

Comments are closed.