ప్రముఖ జానపద గాయకుడు, బలగం సినిమాతో తెలుగు సినీ అభిమానులకు చేరువైన మొగిలయ్య అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రామీణ కథా నేపథ్యం, అనుబంధాలు-అనురాగాలు కథాంశంగా తెరకెక్కిన ఆ సినిమాలో తోడుగా మా తోడుంది, నీడగా మాతో నడిచి నువ్వెట్టా వెళ్లినావు కొమురయ్యా అనే పాటను కొమురమ్మతో కలిసి మొగిలయ్య భావోద్వేగంతో ఆలపించి, ప్రేక్షకులతో కూడా కన్నీళ్లు పెట్టించారు.
ఆ ఒక్క పాటతో ప్రేక్షకులకు చేరువైన మొగిలయ్య కొంత కాలంగా కిడ్నీ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. సమస్య తీవ్రం కావడంతో వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎవరికీ అందని లోకాలకు చేరుకున్నారు. పాటను జ్ఞాపకంగా మిగిల్చి ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచారాయన.
దీంతో జానపద రంగం మంచి కళాకారుల్ని కోల్పోయినట్టైంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మొగిలయ్య, జానపద కళనే నమ్ముకుని జీవనం సాగించేవారు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నారు. మొగిలయ్య కుమారుడు సుదర్శన్ ప్రస్తుతం స్టీల్ సామానులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మొగిలయ్య లేనప్పటికీ, ఆయన ఆలపించిన జానపద గేయం మాత్రం చిరస్థాయిగా జీవిస్తూనే వుంటుంది. కళకు మరణం లేదనేందుకు మొగిలయ్య ఆలపించిన పాటే నిదర్శనం.
ఓం శాంతి
మొగులయ్య మరణం జానపద కళారంగానికి తీరని లోటు. మొగులయ్య వంటి ప్రతిభావంతుల కళాకారులు మన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబానికి మనోధైర్యం కలగాలని కోరుకుందాము .
🙏